Lady Professor : క్లాస్ రూమ్లో స్టూడెంట్తో పెళ్లి..  లేడీ ప్రొఫెసర్ సంచలన నిర్ణయం!

క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లేడీ ప్రొఫెసర్ తన రాజీనామా లేఖను సమర్పించారు.  తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని...  పని చేయలేనని తన రాజీనామా లేఖలో వెల్లడించారు.

New Update
Lady professor

Lady professor

క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలసిందే. పశ్చిమ బెంగాల్‌లోని హరిన్‌ఘటలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (MAKAUT) సైకాలజీ విభాగంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో విద్యార్థినిని సస్పెండ్ చేసిన యాజమాన్యం..   లేడీ ప్రొఫెసర్ ను అధికారులు సెలవుపై పంపించారు. ఈ నేపథ్యంలో లేడీ ప్రొఫెసర్ పాయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ  విషయాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పార్థ్ ప్రతిమ్ లాహిరి తెలిపారు.  ఫిబ్రవరి 1న విశ్వవిద్యాలయానికి ఇమెయిల్ లో వీడియో వైరల్ గా మారడ వలన తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని... పని చేయలేనని తన రాజీనామా లేఖలో వెల్లడించారు. సంస్థతో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించినందుకు MAKAUTకి కృతజ్ఞతలు తెలిపింది.  ఆమె రాజీనామాపై వర్సిటీ త్వరలో నిర్ణయం తీసుకుకోనుంది.  

యాజమాన్యం విచారణ

కాగా క్లాస్ రూమ్ లో  స్టూడెంట్,  లేడీ ప్రొఫెసర్ లకు విద్యార్థులు దగ్గరుండి పెళ్లి చేశారు.  హిందూ బెంగాలీ వివాహ ఆచారాల ప్రకారం ఈ పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో యాజమాన్యం విచారణ చేపట్టింది.  వర్సిటీ ముగ్గురు సభ్యుల విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, ప్రొఫెసర్ నుండి వివరణ  కోరింది. అయితే ఇది క్లాస్‌లో సైకో డ్రామా అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఇది అకడమిక్ ప్రాజెక్ట్‌లో భాగమని, అసలు పెళ్లి కాదని చెప్పారు. సైకాలజీ డిపార్డ్ మెంట్ ప్రతిష్టనే దిగజార్చడానికి కొందరు వీడియోలను లీక్ చేశారని ప్రొఫెసర్ మండిపడ్దారు. మరోవైపు ఒక మీడియా ఛానెల్‌తో ప్రొఫెసర్  మాట్లాడుతూ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా వీడియోను లీక్ చేశారని ఆరోపించారు. త్వరలోనే నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పారు. ఇలా చేసిన వారెవరూ ఇప్పుడు తప్పించుకోరని ఆమె వెల్లడించారు. తనకు మద్దతు ఇస్తున్న తన భర్తతో సహా తన సన్నిహితులందరికీ ధన్యవాదాలు తెలిపింది.

Also Read :  Summer Effect: భగభగమంటున్న భానుడు..రానున్న 15 రోజులు జర జాగ్రత్త.. అధికారుల హెచ్చరికలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: జమ్మూ కశ్మీర్లో మరో దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు!

పహల్గామ్ ఘటన మరువకముందే టెర్రరిస్టులు మరో దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

New Update
V BREAKING

పహల్గామ్ ఘటన మరువకముందే టెర్రరిస్టులు మరో దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను టెర్రరిస్టులు టార్గెట్ చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా పహల్గామ్ ఘటనలో 25 మంది భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. 2019 పుల్వామా బాంబు దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో పహల్గామ్ దాడి ఒకటిగా అభివర్ణించబడుతోంది, ఈ దాడిలో 40 మంది CRPF సిబ్బంది మరణించారు.  ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద దాడులలో ఇది ఒకటి.

Advertisment
Advertisment
Advertisment