Raghav Chadha : బీజేపీలోకి రాఘవ్ చద్దా.. వెనకుండి చక్రం తిప్పిన ప్రియాంక చోప్రా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో  ఎవరూ చెప్పలేరు అంటారు..ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా హఠాత్తుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

New Update
raghav

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో  ఎవరూ చెప్పలేరు అంటారు.. కానీ ఈసారి జరిగిన మార్పు మాత్రం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతోంది.  అదేంటంటే ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా(raghav-chadha) హఠాత్తుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే దీని వెనుక.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) చక్రం తిప్పారని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, నవజ్యోత్ కౌర్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేశారు.

Also Read :  ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో రాజీవ్ కనకాల..? మరోసారి మ్యాజిక్ రిపీట్!

 బాంబు పేల్చిన సిద్ధూ భార్య

నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఆరోపణల ప్రకారం.. రాఘవ్ చద్దాను ఆప్ అధినేత కేజ్రీవాల్ తో సహా మిగతా పెద్దలు టార్గెట్ చేస్తున్నారని ప్రియాంకకు తెలిసిందట. తన చెల్లెలు పరిణీతి చోప్రా భర్త (వరుసకు బావమరిది) అయిన రాఘవ్‌ను కాపాడుకోవాలని ప్రియాంక నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారని, రాఘవ్ చద్దాను తన తమ్ముడిలా చూసుకోవాలని కోరారని సిద్ధూ భార్య బాంబు పేల్చారు. ఈ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే రాఘవ్ చడ్డా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్‌గా బీజేపీలోకి వెళ్లగలిగారని ఆమె వాదిస్తున్నారు.

దాదాపు 15 ఏళ్లుగా ఆప్‌లో ఉన్న రాఘవ్ చద్దా.. తనతో పాటు మరికొంత మంది రాజ్యసభ ఎంపీలతో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. నేను సరైన వాడినే కానీ.. తప్పుడు పార్టీలో ఉన్నానంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పని చేసే వాతావరణం బాలేదని, అందుకే బయటకు వస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. భయం వల్లనో, ఒత్తిడి వల్లనో తాను పార్టీ మారలేదని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ఈ ఆరోపణలపై అటు ప్రియాంక చోప్రా గానీ, ఇటు బీజేపీ గానీ ఇంకా స్పందించలేదు. ఇది కేవలం పుకారా లేక నిజంగానే ప్రియాంక తన బావమరిది కోసం పొలిటికల్ గేమ్ ఆడారా అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఏదేమైనా.. రాజకీయాల్లో కుటుంబ బంధాలు, సెలబ్రిటీల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Also Read :  విష్ణుప్రియతో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి

Advertisment
తాజా కథనాలు