/rtv/media/media_files/2026/04/20/private-jet-crashes-into-hillside-in-chhattisgarh-2026-04-20-17-11-26.jpg)
Private jet crashes into hillside in Chhattisgarh
ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జశ్‌పుర్ జిల్లాలోని కొండల్లో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. అటవీ ప్రాంతంలోని ఓ చెట్టును ఢీకొని అది కూలిపోయినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఘటనాస్థలంలో మంటలు ఎగిసిపడటంతో దట్టంగా పొగ అలముకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రైవేట్ జెట్‌లో ఎంతమంది ఉన్నారనేదానిపై క్లారిటీ లేదు. సమాచారం మేరకు పోలీసులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Jashpur - Reports of a possible aircraft crash have emerged from the Narayanpur region in Jashpur district of Chhattisgarh. According to preliminary information, an aircraft was seen flying at a low altitude over the hilly terrain before crashing. Thick plumes of smoke have been… pic.twitter.com/fX99UyuirT
— NextMinute News (@nextminutenews7) April 20, 2026
Also Read: రూ.79,450 కోట్లు బూడిదపాలు.. రేపు ఓపెనింగ్, ఈరోజు కాలిపోయిన రిఫైనరీ ఫ్యాక్టరీ
ఇదిలాఉండగా 2022 మేలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లైట్ ప్రాక్టీస్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక 2007లో బస్తర్ అడవుల్లో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం ప్రమోద్ మహాజన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ కూడా ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Follow Us