/rtv/media/media_files/2026/02/22/modi-2026-02-22-15-25-51.jpg)
ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(prime-minister-modi) మేరఠ్‌లో దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో సేవ(fastest metro service) లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి శతాబ్ది నగర్ నుండి మేరఠ్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో స్వయంగా ప్రయాణించి, సౌకర్యాలను పరిశీలించారు.
Also Read : మహిళపై క్షుద్ర పూజలు.. పార్శిల్‌లో మనిషి పుర్రె కలకలం!
మెట్రో ప్రత్యేకతలు
ఈ మెట్రో రైలు సాధారణంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే దీని గరిష్ట వేగ సామర్థ్యం గంటకు 180 కిలోమీటర్లుగా అధికారులు ధృవీకరించారు. దీనివల్ల మేరఠ్ సౌత్ స్టేషన్ నుండి మోదీపురం డిపో వరకు ఉన్న 23 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణికులు కేవలం 30 నిమిషాల్లోపే చేరుకోవచ్చు. ఈ సేవలు సాయంత్రం 6 గంటల నుండి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
Also Read : ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారా? అయితే ముందు మీ పేరెంట్స్‌కు మెసేజ్ వెళ్తుంది!
నమో భారత్ రైలు
మెట్రోతో పాటు, ప్రధాని అత్యంత ప్రతిష్టాత్మకమైన 'నమో భారత్' రైలు(Namo Bharat Trains) ను కూడా ప్రారంభించారు. దిల్లీ, మేరఠ్ నగరాల మధ్య అనుసంధానతను పెంచే ఈ రైలు, గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది. రైల్వే ప్రాజెక్టులతో పాటు, ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసం దాదాపు రూ. 12,390 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ కొత్త రవాణా వ్యవస్థలతో మేరఠ్ మరియు పరిసర ప్రాంతాల ఆర్థిక ముఖచిత్రం మారిపోనుందని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Follow Us