Manipur: మణిపూర్ సీఎం రాజీనామా.. తర్వాత రాష్ట్రపతి పాలన?

మణిపూర్ లో ఏడాదిన్నరగా హింస కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో అక్కడ రాజకీయ అనిశ్చితి పెరిగింది. దాంతో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

New Update
Supreme Court seeks forensic report on audio clips alleging Biren Singh's role in ethnic clash

Supreme Court seeks forensic report on audio clips alleging Biren Singh's role in ethnic clash

Manipur: బీరేన్ సింగ్ (CM Biren Singh) రాజీనామా మణిపూర్ లో రాజకీయ అనిశ్చితికి దారి తీసింది. అసలే హింసతో రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ కొత్త సమస్యతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తొందరలో ఇక్కడ ఎవరో ఒకరు సీఎం కాకపోతే పరిస్ధితి మరింద దారుణంగా తయారవుతుందని అంటున్నారు. బిరేన్ సింగ్ ప్రస్తుతం తాత్కాలిక ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇప్పుడు, బిజెపి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోలేకపోతే, అసెంబ్లీ సమావేశాన్ని పిలవకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ముందుకు రావడం లేదని...దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఉత్సాహం చూపించడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే ఇక్కడ రాష్ట్రపతి పాలనే నియమించే అవకాశమే ఎక్కువగా ఉందని అంటున్నారు. 

Also Read:  Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

ఆరు నెలల గ్యాప్ ఉంటే అదే...

రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ రెండు సమావేశాల మధ్య 6 నెలల కంటే ఎక్కువ అంతరం ఉండకూడదు.. కానీ మణిపూర్ అసెంబ్లీ సందర్భంలో ఈ రాజ్యాంగ కాలపరిమితి నేటితో ముగుస్తోంది. అంతేకాకుండా, రాష్ట్రంలో అనేక రౌండ్ల సమావేశాల తర్వాత కూడా.. ఏ పార్టీ లేదా కూటమి ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు. కనీసం దాని గురించి మాట్లాడడం కూడా లేదు. దీని బట్టి ఇక్కడ అసెంబ్లీని రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలను అన్వేషించే ప్రయత్నాలు కొనసాగుతాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏ ఆధారం, హోప్ లేకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. దీని బట్టి ప్రధాని మోదీ తన విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. 

Also Read: PM MOdi: భారత్ లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం..ప్రధాని మోదీ

Also Read: Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Watch Video: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఓ చెట్టు కింద చీతా దాని నాలుగు పిల్లలు సేద తీరుతున్నాయి. అటవీశాఖకు చెందిన ఓ డ్రైవర్ వాటికి నీళ్లు అందించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఉన్నతాధికాలు అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

New Update
Madhya Pradesh villager offers water to cheetah

Madhya Pradesh villager offers water to cheetah

వేసవి కాలం రావడం వల్ల మూగజీవాలకు నీళ్లు దొరకగా అవస్థలు పడుతున్నాయి. సాధారణంగా కొంతమంది జంతు ప్రేమికులు మూగజీవుల కోసం ఆహారం, నీటి వసతులను ఏర్పాటు చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అందులో ఉన్న చీతాలకు నీళ్లు అందించినందుకు ఓ డ్రైవర్‌ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఓ చెట్టు కింద చీతా దాని నాలుగు పిల్లలు సేద తీరుతున్నాయి. ఈ క్రమంలోనే అటవీశాఖకు చెందిన ఓ డ్రైవర్ వాటిని గమనించి ఓ క్యాన్‌లో నీళ్లు తీసుకొచ్చాడు. ఓ పాత్రలో ఈ నీటిని పోసీ చీతాలకు తాగించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఆయన చేసిన మంచి పనిని ప్రశంసిస్తున్నారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం ఆ డ్రైవర్‌పై మండిపడ్డారు. ఏకంగా అతడిని ఉద్యోగంలో నుంచే సస్పెండ్ చేశాడు. 

దీనిపై అటవీశాఖ అధికారి ఓ ప్రకటన చేశారు. '' చీతాలకు నీళ్లు అందించాలని గ్రామస్థులు అనుకుంటున్నారు. ఈ జీవాలు ఎవరికీ హాని కలిగించేవి కావని వాళ్లు తెలుసుకుంటున్నారు. ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని కూడా వాళ్లందరూ గ్రహించారు. వాటితో స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని'' అటవీశాఖ అధికారి అన్నారు. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

మరోవైపు ఇటీవల చీతాను దాని పిల్లలు ఓ జంతువు వెంట పడుతూ గ్రామంలోకి వచ్చాయి. దీంతో వాటిని పొలంలో చూసిన కొందరు స్థానికులు భయపడ్డారు. ఆ తర్వాత చీతాలపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో అవి అక్కడి నుంచి పారిపోయాయి. తాజాగా వాటిని నీరు అందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


 

 rtv-news | national-news | kuno-national-park 

Advertisment
Advertisment
Advertisment