Poorest MLAs : పూర్‌ ఎమ్మెల్యేలు..వీరి సంపాదనెంతో తెలుసా?

ఒక్కసారి ఒక చిన్న కార్పొరేటర్‌గా ఎన్నికైతేనే కోట్లు సంపాదించుకుంటారు రాజకీయ నాయకులు. చాలా స్వల్ప ఆదాయం  ఉన్న వారు నేటికి రాజకీయాల్లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా కేవలం రూ. 17 వందలతో ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

New Update
poorest MLAs in India

poorest MLAs in India

Poorest MLAs : ఒక్కసారి ఒక చిన్న కార్పొరేటర్‌గా ఎన్నికైతేనే కోట్లు సంపాదించుకుంటారు రాజకీయ నాయకులు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైతే తరతరాలు తిన్న తరగనంత ఆస్తులు ముఠా కట్టుకుంటారు. కానీ ఎమ్మెల్యేగా ఎన్నికైనా సంపదలో మాత్రం చాలా స్వల్ప ఆదాయం  ఉన్న వారు నేటికి రాజకీయాల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఆ క్రమంలో అత్యల్ప సంపద కలిగిన ఎమ్మెల్యేల జాబితాను తాజాగా విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా కేవలం రూ. 17 వందలతో ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు సమర్పించిన తమ అఫిడవిట్ల ఆధారంగా ఈ జాబితాను ఏడీఆర్ రూపొందించింది.

Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!

ఆ క్రమంలో దేశంలోని 28 రాష్ట్రాలతోపాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు.. వారు ఎన్నికలకు ముందు దాఖలు చేసిన ఆయా అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను తయారు చేసింది.ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో రూ.18,370 సంపదతో పంజాబ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే నరేంద్ర పాల్ సింగ్ స్వన్, ఆ తర్వాత స్థానంలో రూ.24,409 సంపదతో అదే రాష్ట్రానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే నరేంద్ర కౌర్ బరజ్ ఉన్నారు. నాలుగో స్థానంలో రూ.29,070తో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ నిలిచారు. ఐదో స్థానంలో రూ.30,423తో పశ్చిమ బెంగాల్‌లోని ఏఐటీసీ ఎమ్మెల్యే పుండరీకాక్ష సాహ ఉన్నారు.

Also Read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!

ఆరో స్థానంలో రూ.30,496తో ఉత్తరప్రదేశ్‌లోని సమాజవాదీ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రదాన్ నిలిచారు. ఏడో స్థానంలో రూ.35,076 సంపదతో ఒడిశాలోని బీజేపీ ఎమ్మెల్యే సంజాలి ముర్ము ఉన్నారు. ఎనిమిదో స్థానంలో రూ.62,296తో పశ్చిమ బెంగాల్‌కు చెందిన చందనా బౌరి నిలిచారు. ఇక రూ.63,000 సంపదతో త్రిపురలోని తిపుర మోతాకు చెందిన నందితా దేవ్‌వర్మ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. అలాగే పదో స్థానంలో రూ. 70 వేలతో బిహార్‌కు చెందిన రామవృక్ష సదా నిలిచారు.

Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

త్రిపుర ఎమ్మెల్యేల మొత్తం ఆస్తులు కేవలం రూ. 90 కోట్లు మాత్రమే ఉన్నాయి. అదే బాటలో పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే అత్యధికంగా ఎమ్మెల్యేల ఆస్తులు కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు ముందు వరుసలో నిలిచాయి. మరోవైపు దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అలాంటి రాష్ట్రాల్లోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం అతి తక్కువ సంపద కలిగి ఉండడం గమనార్హం. అలాగే ఆ జాబితాలో పలువురు ఆప్ ఎమ్మెల్యేలు ఉండగా.. తృణమూల్ కాంగ్రెస్, సమాజవాదీ పార్టీల నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు.

Also Read: హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పేందుకు వెళ్తే ఊహించని ట్విస్ట్

Advertisment
Advertisment
Advertisment