PM Modi: అన్ని రాష్ట్రాల సీఎంలతో కలిసి ప్రధాని మోదీ మీటింగ్ .. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా ?

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. శుక్రవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన వర్చువల్‌గా భేటీ కానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారితో మాట్లాడనున్నారు.

New Update
PM to speak to Chief Ministers tomorrow to review preparedness amid Iran war

PM to speak to Chief Ministers tomorrow to review preparedness amid Iran war

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. శుక్రవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన వర్చువల్‌గా భేటీ కానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారితో మాట్లాడనున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, దేశంలో కేంద్రం పాటిస్తున్న విధానాలను వివరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రాల సన్నద్ధత, సహకారంపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. 

Also Read: క్లాస్‌రూంలో విద్యార్థినికి 'ఐ లవ్‌ యూ చెప్పిన' ప్రొఫెసర్‌.. చెప్పుతో కొట్టిన స్టూడెంట్

వచ్చే నెలలో తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి (కేంద్ర పాలిత ప్రాంతం)లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల సీఎంలు ఈ మీటింగ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేబినెట్‌ సెక్రటరీ హాజరుకానున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో తీసుకున్న వివరాలను సీఎస్‌లకు చెప్పి ఆయా రాష్ట్రాల్లో విధానాలు అమలు చేసేలా కేబినెట్ సెక్రటరీ సూచించనున్నట్లు తెలుస్తోంది.   

Also Read: హర్మూజ్ జలసంధిపై పట్టు కోల్పోయిన ఇరాన్.. నావీ చీఫ్ మృతి

ఇదిలాఉండగా ఇటీవల ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడుతూ యుద్ధం వల్ల నెలకొన్న పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి టీమ్ ఇండియా పనిచేయాలన్నారు. కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అయితే రేపు ఆయన అన్ని రాష్ట్రాల సీఎంలతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు దేశంలో లాక్‌డౌన్ విధించే పరిస్థితులు రావొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు