/rtv/media/media_files/2025/02/18/R1LX9t1NMjRed2S8lU80.jpg)
modi quatar
ఖతార్ అధినేత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం భారత్‌కు సోమవారం చేరుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ... స్వయంగా ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్ లో పేర్కొన్నారు. ‘‘నా సోదరుడు, ఖతార్ ఎమిర్ హెచ్ హెచ్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్-థానీకి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లాను. ఆయన భారత్ పర్యటన విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా.. రేపు మేము ఇరువురం భేటీ కాబోతున్నాం’’ అని పేర్కొంటూ ఫొటోలను మోడీ పోస్ట్ చేశారు.
Also Read: Pakistan: నీరు లేక అల్లాడుతున్నపాక్.. 700 అడుగులు తవ్విన చుక్క నీరు లేదు!
Went to the airport to welcome my brother, Amir of Qatar H.H. Sheikh Tamim Bin Hamad Al Thani. Wishing him a fruitful stay in India and looking forward to our meeting tomorrow.@TamimBinHamad pic.twitter.com/seReF2N26V
— Narendra Modi (@narendramodi) February 17, 2025
విమానాశ్రయం నుంచి వచ్చిన అనంతరం విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్‌తో తమీమ్ బిన్ హమద్ భేటీ అయ్యారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఖతర్ ఎమిర్ మంగళవారం కలవనున్నారు. ఈ భేటీ తర్వాత హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరువురు భారత్- ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read:Bengalore: ప్లీజ్ ఉద్యోగం ఇవ్వండి చాలు.. ఉచితంగా పనిచేస్తాను.. బెంగళూరు టెకీ పోస్ట్ వైరల్
దాదాపు పదేళ్ల తర్వాత..
పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకుంటారని తెలిపింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వచ్చిన తమీమ్ బిన్ హమద్.. భారత్ కు రావడం ఇది రెండోసారి. గతంలో మార్చి 2015లో ఆయన భారత్‌కు వచ్చారు. మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత భారత్‌కు వచ్చారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని తాజా పర్యటన మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగశాఖ అభిప్రాయపడింది.
ఎమిర్ వెంట ఖతార్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన ప్రతినిధుల బృందం సైతం భారత్‌కు చేరుకుంది. ఇదిలా ఉండగా, భారత్, ఖతార్ మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల మైత్రికి శతాబ్దాల చరిత్ర ఉంది. భారత్‌కు నమ్మకమైన భాగస్వాముల్లో ఖతార్ ఒకటి. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులు, ఎనర్జీ, టెక్నాలజీతో పాటు ప్రజల మధ్య బంధం మరింత బలోపేతమవుతోంది. ఖతార్‌లో నివసిస్తోన్న విదేశీయుల్లో భారతీయులే మొదటి స్థానంలో ఉండటం విశేషం.
Also Read: Ap: ఏపీలో మహిళలకు తీపికబురు.. వారందరికి ఉచితంగా కుట్టు మిషన్లు
Also Read: CEC: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..!
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
KKR Vs PBKS: కేకేఆర్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..