/rtv/media/media_files/2026/04/14/pm-modi-pays-tributes-to-babasaheb-ambedkar-at-parliament-premises-2026-04-14-10-17-06.jpg)
Pm Modi Pays Tributes To Babasaheb Ambedkar At Parliament Premises
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఆవరణలోని 'ప్రేరణా స్థల్' వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు. ప్రగతిశీల సమాజం కోసం బాబాసాహెబ్ కన్న కలలు, ఆయన ఆశయాలు నేటికీ దేశానికి స్ఫూర్తినిస్తాయంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, అలాగే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా పాల్గొన్నారు.
Also Read: ఏప్రిల్ 14 న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి...ఆయన గురించి కొన్ని ఆసక్తికర అంశాలు
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయంగా ప్రత్యర్థులైన ప్రధాని మోదీ, ఖర్గే ఒకరినొకరు పలకరించుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసి ఫొటోలు దిగడం, ఆ తర్వాత మోదీ నవ్వుతూ ఖర్గే నుంచి వెళ్లిపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా అంబేద్కర్ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi and Congress national president Mallikarjun Kharge share a light-hearted moment
— ANI (@ANI) April 14, 2026
PM Modi and other leaders paid tribute to Bharat Ratna Dr BR Ambedkar at Prerna Sthal in the parliament premises on the occasion of Ambedkar Jayanti.… https://t.co/JoquMq3m4dpic.twitter.com/vN3KkG63j1
జాతి నిర్మాణంలో అంబేద్కర్‌ది సాటిలేని పాత్ర అంటూ కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరువలేదన్నారు. దేశ ప్రజలందరికీ ఆయన జీవితం ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Tributes to Dr. Babasaheb Ambedkar on his birth anniversary. His efforts towards nation building are deeply motivating. His life and work continue to inspire generations to build a just and progressive society. pic.twitter.com/MWHUTlpf9Y
— Narendra Modi (@narendramodi) April 14, 2026
Follow Us