PM Modi: పెట్రోల్, డీజిల్ పరిమితంగా వాడండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి పలు కీలక సూచనలు చేశారు. ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉందన్నారు. కష్టసమయంలో దేశమంతా ఏకంగా ఉండాలన్నారు.

New Update
PM Modi

PM Modi

పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి పలు కీలక సూచనలు చేశారు. ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉంది. కష్టసమయంలో దేశమంతా ఏకంగా ఉండాలి. అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలి. త్యాగాలు చేయండి.. దేశ భక్తిని చాటండి. కరోనా లాంటి సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నాం. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా వాడండి. ప్రజారవాణాను వినియోగించండి. వీలైనంత వరకు మెట్రోలో ప్రయాణం చేయండి. 

ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించండి. ఎరువులు, రసాయనాలపై అతిగా ఆధారపడకండి. ఎరువులు, రసాయనాల వినియోగం సగానికి సగం తగ్గించండి. మనం విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవాలి. రైతులు సోలార్ పంపులను వినియోగించాలి. గుండుసూది నుంచి ప్రతిదీ విదేశీ వస్తువులు కొనొద్దు. వర్క్‌ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్‌లు పెట్టుకోవాలి. ఏడాది పాటు విదేశీ పర్యటనలకు వెళ్లకపోవడం మంచింది. వంట నూనెల ఖర్చు తగ్గించుకోవాలి. దుబార ఖర్చులు మానుకోవాలి. పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనడం తగ్గించాలి. ఏడాది పాటు బంగారం కొనడాన్ని ఆపేద్దాం. బంగారం దిగుమతులు తగ్గితేనే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందని'' ప్రధాని మోదీ సూచనలు చేశారు. 

Advertisment
తాజా కథనాలు