/rtv/media/media_files/2025/04/03/Ja05qtx2tO8qF3paMEsC.jpg)
gjarat
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గురువారం అర్ధరాత్రి ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోగా.. మరొక పైలట్ గాయాలతో బయటపడ్డాడు.అయితే ఈ దుర్ఘటనలో సిద్ధార్థ్ యాదవ్(28) అనే పైలట్ మృతి చెందాడు. 2016లో నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి భారత వైమానిక దళంలో చేరాడు. గత నెల మార్చి 23న నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఇందుకోసం సిద్ధార్థ యాదవ్ సిద్ధపడుతున్నాడు.
Also Read: viral News: పోషించలేనప్పుడు పెళ్లెందుకు చేసుకుంటున్నారు..!
కానీ ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.శిక్షణలో ఉండగా ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే జామ్‌నగర్ జిల్లాలోని సువార్ద గ్రామంలోకి వచ్చేటప్పటికీ ప్రమాదం పొంచి ఉందని గుర్తించాడు. ఇళ్ల మధ్య కూలిపోతే.. పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని భావించాడు. ప్రమాదం నుంచి ప్రజలను కాపాడాలని నిర్ణయం తీసుకున్నాడు.
Also Read: US Mayor: అటార్నీ జనరల్‌కు అసభ్యకర వీడియో పంపిన మేయర్..
తనతో పాటు ఉన్న కో-పైలట్‌ను కిందకు దించేసి.. జనసాంద్రత లేని ప్రాంతానికి జెట్‌ను నడిపించాడు. సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాడు.. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. దీంతో సిద్ధార్ధ యాదవ్ అమరడుయ్యాడు. కానీ గ్రామస్తుల ప్రాణాలను కాపాడి.. ఒక సాహస వీరుడయ్యాడు. బుధవారం రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలోని వైమానిక దళం స్టేషన్ నుంచి జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది.
కొన్ని నిమిషాల్లోనే కూలిపోవడంతో రేవారీ నివాసి అయిన ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ మరణించాడు. సిద్ధార్ధ ఇటీవలే సెలవుల తర్వాత విధులకు రావడం విశేషం. సుశీల్-నీలం యాదవ్‌ల ఏకైక కుమారుడు సిద్ధార్థ్ యాదవ్. ఫైటర్ పైలట్‌గా శిక్షణ పూర్తి చేసి 2016లో NDA పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత భారత వైమానిక దళంలో చేరాడు. రెండేళ్ల క్రితమే ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి లభించింది.
రేవారిలోని భల్కి-మజ్రా గ్రామానికి చెందిన సిద్ధార్ధ కుటుంబం నవంబర్ 2న జరగాల్సిన వివాహం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే సిద్ధార్థ తిరిగి విధుల్లో చేరాడు. కానీ ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. దీంతో బంధువులంతా కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక కుమారుడి యొక్క ధైర్య సాహసాలను తండ్రి సుశీల్ యాదవ్ ప్రశంసించారు. ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.
Also Read: Pentagon: యెమెన్ యుద్ద ప్రణాళికలు లీక్..!
Also Read: Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. !
gujarat | jet bursts | jet plane crash | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates