/rtv/media/media_files/2026/05/19/petrol-diesel-rates-2026-05-19-07-18-23.jpg)
Petrol, Diesel rates Hiked
దేశంలో వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత పెరిగింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోమారు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే లీటరుకు రూ.3 మేర పెంచిన చమురు సంస్థలు.. తాజాగాపెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచుతూ షాక్ ఇచ్చాయి. నాలుగు రోజుల వ్యవధిలో ఇంధన ధరలు రెండుసార్లు పెరగడంతో వాహనదారులు ఖంగుతింటున్నారు. నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి, ద్రవ్యోల్బణం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also read: ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్..
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.98.64, డీజిల్ ధర రూ.91.58కు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.59, డీజిల్ రూ.94.08 కాగా.. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.70, డీజిల్ రూ.96.07కు పెరిగింది . ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.49, డీజిల్ రూ.96.11కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్‌పై అత్యధికంగా 96 పైసలు పెరిగింది. ఆ తర్వాత ముంబైలో పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 94 పైసలు పెరగగా.. చెన్నైలో పెట్రోల్‌పై 82 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెరిగాయి. కేవలం వారం రోజుల్లోనే రెండుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే రోజుల్లో వీటి ధరలు ఇంకా పెరుగుతాయేమోనని వాహనాదారులు ఆందోళన చెందుతున్నారు.
Follow Us