Parliament Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు..ఈరోజు అఖిలపక్షం సమావేశం

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. 

New Update
Parliamentt

రేపు ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడడంతో పార్లమెంటు సమావేశాలు (Parliament Sessions) మొదలవనున్నాయి. రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు కంటిన్యూగా సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 1న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మూడోసారి ఎన్డీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది. దీంతో ఈ బడ్జెట్ కు ప్రాధాన్యత ఏర్పడింది.   ఫిబ్రవరి 3న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ ప్రారంభమవుతుంది. ఈ సమావేశాల్లో మొత్తం 27 రోజులపాటు పార్లమెంటరీ కార్యకలాపాలు జరుగనున్నాయి. 

Also Read :  వీవీఐపీల పాస్‌ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!

చర్చకు వచ్చే అంశాలు..

ఈ పార్లమెంటు సమావేశాల్లో పలు అంశాలు చర్చకు రానున్నాయని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ (Union Budget) తో పాటూ రైతుల సమస్యలు. ఉపాధి అవకాశాలు,  ఆర్థిక విధానాలపై ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చే రంగాలు, ముఖ్య ప్రణాళికలు, ప్రభుత్వానికి ముందున్న సవాళ్లు, ప్రతిపక్షాలు ఆర్థిక వ్యూహాలు, నిరుద్యోగం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు లాంటి వాటిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం కోరింది. ఇతర పార్టీల నేతలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం తరుఫు నుంచి మంత్రులు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ లు సమాధానం ఇవ్వనున్నారు. 

Also Read: Deep Seek: డీప్ సీక్ వెనుక అందమైన అమ్మాయి..టెక్ సంచలనం

ఈరోజు అఖిల పక్ష సమావేశం..

రేపటి నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల కోసం ఈరోజు అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఇది జరుగుతుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కానున్నాయి. ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, లోక్‌సభ డిప్యూటీ లీడర్, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్, రాజ్యసభ లీడర్, ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా, సహాయ మంత్రులు అర్జున్ మేఘవాల్, మురుగన్ హాజరు కానున్నారు. ప్రతిపక్షం నుంచి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు హాజరవుతారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చించే అంశాలపై అఖిల పక్షం డిస్కస్ చేస్తుంది. 

Also Read: USA:బైడెన్ వదిలేయమన్నారు..ట్రంప్ తొందరగా తీసుకురమ్మన్నారు..వ్యోమగాములపై మస్క్

Also Read :  కుంభమేళాలో తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు