/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jammu-jpg.webp)
Bharat: పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది.దీంతో అప్రమత్తమైన భారత బలగాలు శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పాయి. ఈఘటనలో దాయాది సైన్యం వైపు భారీగా ప్రాణనష్టం వాటిలినట్లు తెలుస్తోంది.
భారత బలగాలు తిప్పికొట్టాయి....
జమ్మూ కశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్ లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నియంత్రణ రేఖ వెంబడి తార్కుండి ప్రాంతంలో ఉన్న ఫార్వర్డ్ పోస్ట్ పై పాక్ సైన్యం జరిపిన కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో శత్రువుల వైపు భారీ ప్రాణనష్టం జరిగిందని భద్రతా అధికారులు వెల్లడించారు.
అయితే మృతుల సంఖ్య వివరాలను మాత్రం స్పష్టం గా చెప్పలేదు. అయితే ఈ సమాచారాన్ని భారత సైన్యం ఇంకా ధ్రువీకరించలేదు. కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి ఈ ఏడాదిలో ఇదే తొలి ఘటన . అయితే గత కొన్ని రోజులుగా వివిధ మార్గాల్లో పాక్ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. ఫిబ్రవరి 4,5 తేదీల మధ్య అర్థరాత్రి కొంతమంది చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం వారి పై కాల్పులు జరిపింది.
ఈ ఘటనలో ఏడుగురు హతమవ్వగా..వీరిలో కొందరు పాక్ భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి 8న రాజైరీ సెక్టార్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడికి గాయాలయ్యాయి.