మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పేర్లు తొలగించింది. 2022-2024 మధ్యకాలంలో మొత్తం 1.55 కోట్ల మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయమంత్రి కమలేశ్ పాసవాన్ బుధవారం జరిగిన లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 86,17,887 మంది పేర్లను తొలగించినట్లు పేర్కొన్నారు.
Also Read: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై బీజేపీ ఎంపీ హేమామాలిని వివాదస్పద వ్యాఖ్యలు
అలాగే 2023-2024లో 68,86,532 మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు చెప్పారు. రెండేళ్లలో మొత్తం 1,55,04,419 మంది కార్మికుల పేర్లను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తీసివేసినట్లు స్పష్టం చేశారు. అయితే ఇలా తొలగించడానికి గల కారణాలను కూడా కేంద్ర మంత్రి వివరించారు. నకిలీ, తప్పుడు జాబ్ కార్డులు ఉండటం, గ్రామాల నుంచి పలు కార్మికుల కుటుంబాలు వెళ్లిపోవడం లేదా పలు గ్రామాలను పట్టణాలుగా వర్గీకరించడం వల్ల ఇంత పెద్ద మొత్తంలో కార్మికుల పేర్లు తొలగించినట్లు పేర్కొన్నారు.
Also Read: మావోయిస్టుల మరో దారుణం.. ఇన్‌ఫార్మర్ నెపంతో యువకుడి హత్య!
ఇదిలాఉండగా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి బడ్జెట్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచకపోవడంపై కాంగ్రెస్ మండిపడింది. గత ఏడాది ఈ స్కీమ్‌కు ముందుగా రూ.60 వేల కోట్లు, ఆ తర్వాత అదనపు నిధులతో కలిపి మొత్తం రూ.89,153.71 కోట్లు కేటాయించారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ అన్నారు. 2025 బడ్జెట్‌లో రూ.86 వేలు కోట్లు మత్రమే కేటాయించారని.. గతంతో పోల్చుకుంటే ఎలాంటి పెరుగుదల లేదని విమర్శించారు.
Also Read: ఆ రాష్ట్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే ?