/rtv/media/media_files/2025/02/08/BeuA3yEfuNKoji59zubD.jpg)
Omar Abdullah
Omar Abdullah: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇండియా కూటమిపై ఆయన విమర్శలు గుప్పించారు. రామాయణం సీరియల్ కు సంబంధించిన జిఫ్ ను షేర్ చేసిన ఆయన జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి.. ఒకరినొకరు అంతం చేసుకోండి అని అందులో ఉంది. ఇండియా కూటమిలోని పార్టీలు కొట్టుకుంటూ ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అర్ధం వచ్చేలా ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా ట్వీట్ చేశారు.
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025
Also Read: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫ్యాన్స్‌లో ఉత్తేజం నింపుతున్న జీతో బాజీ ఖేల్ కే సాంగ్
హోరాహోరి పోరు..
మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్య పోరు హోరాహోరిగా సాగుతోంది. ఇరు పార్టీల మధ్య ఓటింగ్ షేర్ 5శాతంగా ఉంది. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్, ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. రెండు పార్టీల నాయకులు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి వెనుకాడలేదు, మరొకరు బిజెపికి బీ -టీమ్ అని కూడా ఆరోపించారు.
Also Read: Vijayasai Vs Kethireddy: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!
Also Read: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?