/rtv/media/media_files/2026/05/12/bangladesh-2026-05-12-16-40-49.jpg)
Not afraid of barbed wire Bangladesh after Bengal's border fencing push
పశ్చిమబెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ముళ్ల కంచె నిర్మిస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం బార్డర్ సెక్యూరిటీ పోర్స్(BSF)కు భూమి కూడా కేటాయించింది. అయితే ఈ నిర్ణయంపై తాజాగా బంగ్లాదేశ్ స్పందించింది. సరిహద్దుల్లో ముళ్ల కంచె వేసినంత మాత్రాన తాము భయపడబోమని.. బంగ్లా విదేశాంగ శాఖ సలహాదారు ఎం.హెచ్.కబీర్ అన్నారు. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయాలకు సంబంధించి భారత్‌తో నేరుగా చర్చలు జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వైన్ షాపులు బంద్
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలు గమనిస్తున్నామని కబీర్ అన్నారు. కానీ భారత్ అంతర్గత రాజకీయాల్లో తమకు జోక్యం చేసుకోవడం ఇష్టం లేదని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంతోనే ముడిపడి ఉంటాయని వెల్లడించారు. అయితే ఇరు దేశాల మధ్య కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసేందుకు రెండు దేశాల అగ్ర నాయకత్వం కట్టుబడి ఉందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 9 మంది దుర్మరణం
ఇదిలాఉండగా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే సరిహద్దు కంచె నిర్మాణం పూర్తి చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మించేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళానికి (BSF) భూమిని కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అందుకే 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా బెంగాల్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది.
Follow Us