/rtv/media/media_files/2026/05/20/norwegian-daily-under-fire-for-racist-cartoon-of-pm-modi-as-snake-charmer-2026-05-20-09-06-46.jpg)
Norwegian daily under fire for racist cartoon of PM Modi as snake charmer
భారత ప్రధాని మోదీని నార్వేకు చెందిన ప్రముఖ పత్రిక ‘ఆఫ్టెన్‌పోస్టెన్’ టార్గెట్ చేసింది. ఆయనపై న్యూస్‌పేపర్‌లో ప్రచురించిన ఓ కార్టూన్ ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రధాని మోదీ నార్వే రాజధాని ఓస్లో పర్యటనలో ఉన్న నేపథ్యంలోనే ఈ కార్టూన్ వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ చిత్రాన్ని జాత్యహంకార ధోరణిలో ప్రతిబింబిస్తూ గీసిన ఈ కార్టూన్‌కు ' తెలివైన, విసిగించే వ్యక్తి' అనే శీర్షికను పెట్టింది. కేవలం కార్టూన్‌కి మాత్రమే పరిమితం కాకుండా.. అందులో ప్రచురించిన ప్రత్యేక వ్యాసంలో కూడా భారత విదేశాంగ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతూ వ్యంగ్య విమర్శించింది.
Also Read: అత్యాచార నిందితుడికి పుల దండలతో ఘనస్వాగతం.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
ఈ కార్టున్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆ పత్రికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధారణ రాజకీయ విమర్శ కాదని.. పూర్తిగా జాత్యహంకారంతో కూడుకున్న నీచమైన చర్య అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. యూరోపియన్లు ఇంకా తమ పాత వలసవాద మనస్తత్వం, భ్రమల నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. అందుకే ప్రపంచ వేదికపై ఒక దేశ ప్రధానిని ఇలా కించపరిచేలా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. నార్వేలో ప్రముఖ పత్రికా సంస్థ అయి ఉండి కూడా ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించడం జర్నలిజం విలువలకు విరుద్ధమంటూ ఎద్దేవా చేస్తున్నారు.
మరోవైపు భారత్ అన్ని రంగాల్లో వేగంగా ఎదగడాన్ని కొన్ని పాశ్చాత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయనే కోణంలో కూడా మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఒక దేశాధినేత అధికారిక పర్యటన సందర్భంగా ఇలాంటి హేయమైన కార్టూన్లు ప్రచురించడం ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Follow Us