BIG BREAKING: విజయ్‌కు మరో బిగ్ షాక్.. ప్రమాణ స్వీకారం రద్దు

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గురువారం టీవీకే చీఫ్‌ విజయ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం రద్దయ్యింది.  మెజార్టీ సంఖ్యా బలం లేకుండా ప్రమాణ స్వీకారం చేయడం కుదరదని ఇన్‌ఛార్జ్‌ గవర్నర్ తెలిపారు.

New Update
No swearing in ceremony for Vijay tomorrow

No swearing in ceremony for Vijay tomorrow

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గురువారం టీవీకే చీఫ్‌ విజయ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం రద్దయ్యింది.  మెజార్టీ సంఖ్యా బలం లేకుండా ప్రమాణ స్వీకారం చేయడం కుదరదని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌ తేల్చిచెప్పారు. టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. విజయ్ రెండు స్థానాల్లో గెలవగా ఓ స్థానానికి ఇందులో మినహాయింపు ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి గెలిచిన అయిదుగురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో టీవీకే సంఖ్యా బలం 112కు చేరింది. ఇప్పటికే 112 మంది ఎమ్మెల్యేల సంతకాలను విజయ్‌ గవర్నర్‌కు సమర్పించారు. 

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విజయ్‌కు మరో 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకేకు మద్దతు ఇవ్వమని లెఫ్ట్ పార్టీలు, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (IUML) స్పష్టం చేశాయి. తాము డీఎంకే కూటమిలోనే ఉంటామని చెప్పాయి. డీఎంకే మిత్రపక్షమైన మరో పార్టీ వీసీకే.. టీవీకేకు మద్దతిచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో CPIకి 2, CPMకి 2, IUML 2, VCKకు 2 సీట్లు వచ్చాయి. టీవీకేకు ఇంకా మెజార్టీ రాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. 

ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ రాకుంటే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. దీని గడువు ఆరు నెలల పాటు ఉంటుంది. ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి సమావేశాలు జరగవు. 6 నెలల్లోపు మెజార్టీ నిరూపించుకోకుంటే అసెంబ్లీ రద్దవుతుంది. దీంతో మళ్లీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో బిహార్, కేరళ, ఢిల్లీ, జమ్ము కశ్మీర్‌లో ఇలాంటి పరిస్థితులే వచ్చాయి. 

Advertisment
తాజా కథనాలు