/rtv/media/media_files/2025/03/16/xl0gYTxgjAGwt93JUUO6.jpg)
Nitin Gadkari
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుల వివక్షపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీని గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకోనన్నారు. కులం, మతం, భాష ఆధారంగా సమాజంలో ఎవరిపై కూడా వివక్ష చూపడకూడదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధి, సమాజ వికాసానికి ఉపయోగపడే విద్య కీలకమని అన్నారు. '' కులం, మతం, భాష వల్ల ఎవరూ కూడా గొప్పవాళ్లు కాలేరు. గుణాల ఆధారంగానే గొప్పవాళ్లవుతారని నేను నమ్ముతాను.
Also Read: మరో వివాదంలో షమీ.. కూతురు చేసిన పనిపై ముస్లిం పెద్దలు ఫైర్!
అందుకే ఎవరిపైకూడా ఇలాంటి వాటి ఆధారంగా వివక్ష చూపించకూడదు. నా రాజకీయ జీవితంలో చుట్టూ అనేక విషయాలు జరుగుతుంటాయి. కానీ నేను నా దారిలోనే నడుస్తాను. ఎవరైనా నాకు ఓటు వేయొచ్చు. లేదా వద్దనుకునే స్వేచ్ఛ కూడా వాళ్లకి ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రానా మొత్తం కోల్పోయినట్లు కాదు. విలువల విషయంలో నేను రాజీపడనని'' నితిన్ గడ్కరీ అన్నారు.
Also Read: రన్యా రావుతో ఇద్దరు మంత్రులకు లింక్..బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
గతంలో తాను ఓ మైనారిటీ విద్యాసంస్థకు ఇంజినీరింగ్ కాలేజ్ మంజూరయ్యేలా చేశాననే విషయాన్ని కూడా గడ్కరీ గుర్తు చేసుకున్నారు. దీనిపై చాలా మంది నన్ను ప్రశ్నించారని.. కానీ చదువు అవసరమైనవారు మైనార్టిలేనని అన్నారు. ఒక వ్యక్తి కుల,మత,భాష,లింగ వివక్షకు అతీతంగా ఎదిగినప్పుడే గొప్పవారు అవుతారని అన్నారు.
Also Read: గ్రూప్ 1 ఫలితాలపై అనుమానాలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు
Also Read: బోట్‌వాలాకు IT షాక్.. రూ.30 సరే ఇప్పుడు రూ.12.8 కోట్ల ట్యాక్స్ కట్టేదెలా..?