బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు12 లక్షల ఆదాయం వరకు ట్యా్క్స్ మినహాయించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకు ఈ నిర్ణయం కేంద్రం ఎందుకు తీసుకుంది అనేదానిపై కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
Also Read: ఢిల్లీలో గెలిచేది ఆ పార్టీయే.. ప్రీపోల్ సర్వేలో సంచలన విషయాలు
'' సామాన్యులకు పన్ను మినహాయింపునకు సంబంధించిన విషయంలో ప్రధాని మోదీ ముందునుంచే సుముఖంగా ఉన్నారు. ఆయన వద్దకు మేము ఈ పన్ను మినహాయింపు ప్రతిపాదన తీసుకెళ్లాం. దీనికి ఆయన అంగీకరించారు. కానీ ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులను ఒప్పించడానికే చాలా సమయం పట్టింది. అయితే ఇలా భారీగా పన్ను మినహయింపు ఇవ్వడం వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇతర మార్గాల ద్వారా ఆదాయం చూసుకున్నారు.
Also Read: ఆ బాలీవుడ్ నటుడికి ఫిదా అయిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా.. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే?
ఆ తర్వాతే ఈ ప్రతిపాదనకు ఆర్థికశాఖ అధికారులు ఒప్పుకున్నారు. అనంతరం దీన్ని బడ్జెట్‌లో ప్రవేశపెట్టాం. నేను ఎక్కడికి వెళ్లినా కూడా పన్ను చెల్లింపుదారులు నిజాయతీగా తమకు బడ్జెట్ వరాలేమి ఉండవా అంటూ అడిగేవారు. వాళ్ల కోసమే ఇలా పన్ను మినహాయింపు ప్రకటించామని'' నిర్మలా సీతారామన్ తెలిపారు.
Also Read: కుంభమేళాలో 'అయోధ్య రామ మందిరం'.. తెలుగు వ్యక్తి టాలెంట్ కి ఫిదా అయిన భక్తులు!
Also Read: 2022 నుంచి పరారీలో ఉన్నాడు..హైదరాబాద్ కాల్పుల నిందితుడు పాత దొంగే..