Nirmala Sitharaman: బడ్జెట్‌పై తొలిసారిగా స్పందించిన నిర్మలా సీతారామన్

కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదని బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభించిందని నిర్మలా సీతారామన్ అన్నారు.

New Update
Nirmala Sitharaman

Nirmala Sitharaman

కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదని బడ్జెట్‌ (Union Budget 2025) లో ఆర్థికమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభించినట్లు పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. '' బడ్జెట్‌లో ఆదాయ పన్ను శ్లాబుల సవరణలతో ప్రజలకు సరిపడా డబ్బులు ఉండేలా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.8 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు రూ.30 వేలు ట్యాక్స్ కట్టేవారు. ఇకనుంచి ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. 

Also Read: 2025 బడ్జెట్‌లో పొరుగుదేశాలకు ఇండియా ఆర్థిక సాయం.. ఏ దేశానికి ఎంతంటే?

Nirmala Sitharaman

మిగతా శ్లాబుల్లో ఉన్నవారికి కూడా ఊరట కల్పించాం. రూ.12 లక్షల ఆదాయంపై రిబేట్‌ పెంపు వల్ల కోటి మందికి పైగా ప్రజలు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్థిక వ్యవస్థలో ప్రతీ అంశానికి ప్రయోజనకరంగా బడ్జెట్‌ను తయారుచేశాం. ఖర్చు పెట్టే ప్రతీ రూపాయిపై ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ రంగానికి అన్నివిధాలుగా అండగా ఉన్నాం. విత్తనం నుంచి మార్కెట్‌ దాకా అన్ని మార్పులు చేశాం. 

Also Read: ‘బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్‌లా’ 2025 బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు

పెట్టుబడి సాయం చేయడం, రుణాలు ఇవ్వడం, కొత్త వంగడాలు సృష్టించడం ఇలా అనేక రకాలుగా రైతులకు అండగా ఉంటున్నాం. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నాం. ఈసారి బడ్జెట్‌లో విద్యుత్‌ తయారీ, అలాగే పంపిణీకి సంబంధించిన సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి పంపిణీకి ప్రాధాన్యమిచ్చాం. అలాగే అవసరమైన మూలధన వ్యయం కూడా కల్పించామని'' నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు.   

Also Read: కొత్త పన్నుతో ఎవరెవరికి ఎంత డబ్బు ఆదా అవుతుందో తెలుసుకోండి!

Also Read: వ్యవసాయ, తయారీ రంగాల్లో ఇవే టాప్ 10 బడ్జెట్ హైలెట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు