/rtv/media/media_files/2025/03/16/tbTI7AIoXcbu7OVED10M.jpg)
Newborn
కర్ణాటకలో ఓ విషాద ఘటన జరిగింది. పుట్టిన కొన్ని నెలలకే ఓ చిన్నారి తల్లితో పాటు జైల్లో చేరింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. బళ్లారి గౌతమ్ నగర్‌లోని యల్లమ్మ అనే మహిళ గతేడాది ఫిబ్రవరిలో చిన్నారికి జన్మనిచ్చింది. కానీ ఆమె భర్త చనిపోయాడు. దీంతో తనకు ఆ బిడ్డ వద్దని భావించింది. చివరికి నవీన్ కుమార్ అనే వ్యక్తికి రూ.60 వేలకు బిడ్డను అమ్మేసింది.
Also Read: గ్రూప్ 1 ఫలితాలపై అనుమానాలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు
ఈ విషయాన్ని తెలుసుకున్న బాలల రక్షణశాఖ గతేడాది ఆగస్టు 5న బళ్లారి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అనంతరం పసిబిడ్డను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆలూరు నుంచి తీసుకొచ్చారు. బిడ్డను కొన్న నవీన్ కుమార్‌ను, అలాగే బిడ్డను అమ్మిన తల్లి యల్లమ్మను అరెస్టు చేశారు. దీంతో ఆ బిడ్డను కూడా తల్లి ఉంటున్న బళ్లారి జైలుకే తరలించారు.
Also Read: రన్యా రావుతో ఇద్దరు మంత్రులకు లింక్..బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
అయితే ఈ కేసులు బిడ్డను అమ్మినవారికి, కొన్నవారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. కోర్టులో దీనికి సంబంధించిన నేరం రుజువైతే తల్లితో పాటు బిడ్డ కూడా జైల్లోనే ఉండాలా ? లేదా బాలల రక్షణ శాఖలోని అమ్మఒడి ఆశ్రమంలో ఉంటుందా ? అనే సందేహం వస్తోంది. అయితే తల్లి వద్దనుకున్న బిడ్డను సంతానం దంపతులకు దత్తత ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి...