/rtv/media/media_files/2026/04/30/lpg-cylinder-2026-04-30-21-45-44.jpg)
LPG Cylinder
LPG సిలిండర్ బుక్ చేసుకునే విధానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. మే 1 నుంచి ఈ నిబంధనలు అమలు కానున్నాయి. ఇకనుంచి చమురు కంపెనీలే ప్రతినెలా LPG సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఈ ధరను కూడా నెల ప్రారంభంలోనే ప్రకటిస్తాయి. ఏప్రిల్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60 పెరిగిన విషయం తెలిసిందే. అలాగే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏకంగా రూ.300 పెరిగాయి.
మే నెల ప్రారంభంలో చమురు కంపెనీలు కొత్త ధరలు ప్రకటించనున్నాయి. ప్రస్తుతం సలిండర్ల బుకింగ్ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే బుకింగ్ రూల్స్ మారనున్నాయి. పట్టణాల్లో రెండోసారి సిలిండర్ బుక్ చేసుకునేందుకు వినియోగదారులు ఇకనుంచి 25 రోజులు ఆగాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇది 21 రోజులు ఉండేది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఇది 45 రోజులకు పెరగనుంది. బ్లాక్ మార్కెటింగ్‌ను కంట్రోల్ చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణలు.. విజయ్‌కు అమిత్ షా ఫోన్ !
కొందరు ఏజెంట్లు, సిబ్బంది గ్యాస్ బుక్ చేసుకున్న కస్టమర్లకు సిలిండర్ డెలివరీ చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో రాస్తున్నారు. ఈ సిలిండర్లను బ్లాకులో అమ్ముకుంటున్నారు. ఇకనుంచి ఇలాంటి తప్పుడు విధానాలకు ఆస్కారం లేకుండా OTP పద్ధతిని ప్రభుత్వం తీసుకురానుంది. ఇకనుంచి OTP ఎంటర్ చేస్తేనే కస్టమర్లకు సిలిండర్ డెలివరీ అయినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే 94 శాతం వినియోగదారులకు దీనికి సంబంధించిన నమోదు పూర్తయ్యింది. సరఫరా, డిమాండ్లలో ఉండే వ్యత్యాసాన్ని నివారించేందుకు, పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు అమలు చేయనుంది.
Also read: చైనాలో కుదేలైన రియల్ ఎస్టేట్.. కారణం ఏంటి? భారత్ పై ఎఫెక్ట్ ఉంటుందా?
Follow Us