New Income Tax Bill 2025: పార్లమెంటులో కొత్త ఐటీ బిల్లు-2025ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను (IT) బిల్లు-2025 ను ప్రవేశపెట్టారు. ఈ చట్టం 2025 ఏప్రిల్‌లో అమలవుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Nirmala Sitharaman

Nirmala Sitharaman

New Income Tax Bill 2025: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) గురువారం లోక్‌సభ(Lok Sabha)లో కొత్త ఆదాయపు పన్ను (IT) బిల్లు-2025 ను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు కొనసాగుతున్న పాత ఆదాయపు పన్ను యాక్ట్‌-1961 దాదాపు 60 ఏళ్ల తర్వాత మారనుంది. తాజాగా ప్రతిపాదించిన ఈ కొత్త చట్టాన్ని ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్ 2025గా పిలవనున్నారు. ఈ చట్టం 2025 ఏప్రిల్‌లో అమలవుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో కొనసాగుతున్న పన్నుల చట్టాలను ఏకీకృతం చేయడం, సవరణలు చేసేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.     

Also Read: పోలీసుల ఆపరేషన్ సక్సెస్.. భారీగా లొంగిపోయిన మావోయిస్టులు!

అయితే లోక్‌సభలో ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను ప్రవేశపెట్టినప్పటికీ పార్లమెంటులో ఇది ఆమోదం పొందడానికి సమయం పడుతుంది. ఈ ఐటీ బిల్లుపై సమీక్ష చేసేందుకు కమిటీకి పంపించనున్నారు. దీనిపై పరిశీలన అనంతరం.. కమిటి తన సిఫార్సులను తెలియజేస్తుంది. ఆ తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు 2025 కేంద్ర కేబినెట్‌ ద్వారా ప్రభుత్వానికి పంపించపడుతుంది. ఆ తర్వాత కేబినెట్‌ సిఫార్సులను పరిశీలిస్తుంది. అనంతరం ఐటీ బిల్లు మళ్లీ పార్లమెంటుకు వెళ్తుంది. పార్లమెంటులో ఇది ఆమోదం పొందాక.. దాన్ని ఎప్పుడు అమలు చేయాలో కేంద్రం నిర్ణయిస్తుంది. 

Also Read: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!

ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లు 2025 

ఈ కొత్త ఐటీ బిల్లు-2025 అనేది భారత పన్ను చట్టాలను ఏకీకృతం చేస్తుంది. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న లోపాలను ఇది తొలగిస్తుంది అలాగే న్యాయపరమైన చిక్కులను తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కొత్త ఐటీ బిల్లు.. పన్ను చెల్లింపుదారుల కోసం మరింత పారదర్శకంగా, అనుకూలంగా ఉండేలా పన్ను చట్టాలను సులభతరం చేస్తుంది.

Also Read:  బెస్ట్ సీఎంగా యోగి.. చంద్రబాబుకు నాలుగో స్థానం.. రేవంత్ ర్యాంకు ఎంత?

Also Read:  ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Turtle Viral Video: తాబేలు ఎంత పని చేసింది భయ్యా.. బికినీ పాపకు చుక్కలు చూపించిందిగా!

నీటిలో స్నానం చేస్తున్న ఓ యువతికి తాబేలు చుక్కలు చూపించింది. హాయిగా ఎంజాయ్ చేస్తున్న ఓ యువతి వద్దకు వెళ్లిన తాబేలు ఆమె పడుకున్న గాలి బెలూన్‌ను కొరికేసింది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా నీటిలోకి దూకి వేరొక గాలి బెలూన్‌పైకి వెళ్లింది. ఆ వీడియో వైరలవుతోంది.

New Update
Turtle Attacks Girl In Bikini

Turtle Attacks Girl In Bikini

సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచం నలుమూలల్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే కళ్ల ముందు కనిపించేస్తుంది. వింతలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు, ఊహకందని విషయాలు, రెప్పపాటులో వణికించే విశేషాలు ఇలా ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

అందులో ఎక్కువ మంది ఎంటర్‌ట్రైన్‌మెంట్ కంటెంట్‌పైనే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మరి మీరు కూడా అలాంటి కంటెంట్‌నే చూడాలనుకుంటే.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఓ తాబేలు చేసిన పనికి నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. దెబ్బకు బికినీ పాపకు చుక్కలు చూపించిన తాబేలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

ఆడుతూ.. ఆడుతూ ఆ తాబేలు ఏం చేసిందో అనే విషయానికొస్తే.. కొందరు యువతులు బికినీ వేసుకుని నీటిలో ఎంజాయ్ చేస్తున్నారు. గాలి బెలూన్లపై పడుకుని నీటిలో సేద తీరుతున్నారు. ప్రకృతి అందాలను ఆశ్వాదిస్తూ సందడి సందడి చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక తాబేలు వారి వద్దకు వచ్చింది. దీంతో ఆ తాబేలును చూసిన ఓ యువతి గాలి బెలూన్‌పై పడుకుని దానితో సరదాగా ఆడింది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

కానీ ఆ తాబేలు మాత్రం ఆడుతూ ఆడుతూ చుక్కలు చూపించింది. తిన్నగా వెళ్లి ఆ యువతి పడుకున్న బెలూన్‌ను కొరికేసింది. ఆ తర్వాత మరో రెండు తాబేళ్లు అక్కడకు చేరుకున్నాయి. అంతలోపే ఆ యువతి పడుకున్న బెలూన్ ఒక్కసారిగా గాలి వదిలేసింది. దీంతో కిందికి దిగి ఆ యువతి పరుగులు తీసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైలర్‌గా మారింది. .

(Turtle videos | latest-telugu-news | telugu-news | viral-videos)

Advertisment
Advertisment
Advertisment