/rtv/media/media_files/2026/05/07/college-student-rapes-stepmother-2026-05-07-21-46-16.jpg)
Nagpur college student rapes, impregnates stepmother arrested
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న 55 ఏళ్ల వ్యక్తి, తనకంటే వయసులో చిన్నదైన 26 ఏళ్ల మహిళను 2024లో రెండో పెళ్లీ చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లిని మొదటి భార్య కొడుకైన 21 ఏళ్ల అక్షత్ శ్రీవాస్తవ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలోనే వీళ్ల మధ్య ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. తన తండ్రి రెండో భార్యపై కక్ష పెంచుకున్న అక్షత్.. ఆమెను రేప్ చేయడం కలకలం రేపింది.
Also Read: ఖైదీని లవ్ చేసి పెళ్లాడిన జైలర్.. ఇది మామూలు లవ్ కాదు మావా..!
బాధిత మహిళ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 10న అక్షత్.. తన సవతి తల్లి గదిలోకి ప్రవేశించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఈ ఘటన వల్ల చివరికీ ఆమె గర్భం దాల్చింది. తాను ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిన తర్వాత చేసేదేమీ లేక జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది.
Also Read: మహిళా ఎమ్మెల్యేను హగ్ చేసుకునేందుకు కాంగ్రెస్ నేత యత్నం.. మండిపడుతున్న నెటిజన్లు..
కానీ కొడుకు భవిష్యత్తు, చదువు, కుటుంబ పరువు పోతుందనే కారణంతో ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని భర్త ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. చివరికీ తనకు న్యాయం జరగదని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్షయ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ చేస్తున్నారు. కన్నతండ్రి భార్య అని కూడా చూడకుండా అక్షయ్ ఇలాంటి నీచానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Follow Us