Mystery disease: అంతుచిక్కని వ్యాధి.. 13 మంది మృతి !

ఛత్తీస్‌గఢ్‌లో గుర్తు తెలియని వ్యాధి కలవరపెడుతోంది. సుక్మా అనే జిల్లాలోని ఓ గ్రామంలో ఈ వ్యాధి వల్ల ఏకంగా 13 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లు నెల వ్యవధిలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Mystery disease claims 13 lives in Chhattisgarh's Sukma village

Mystery disease claims 13 lives in Chhattisgarh's Sukma village

ఛత్తీస్‌గఢ్‌లో గుర్తు తెలియని వ్యాధి కలవరపెడుతోంది. సుక్మా అనే జిల్లాలోని ఓ గ్రామంలో ఈ వ్యాధి వల్ల ఏకంగా 13 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లందరూ ఒక నెల వ్యవధిలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి వైద్య విభాగం అలెర్ట్ అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ధనికోర్తా అనే గ్రామంలో కొందరికి ఛాతినొప్పు, విపరీతమైన దగ్గు వంటి లక్షణాలు వచ్చాయి. ఈ క్రమంలోనే 13 మంది నెల వ్యవధిలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. 

Also Read: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే!

ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరికీ ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఈ అంతుచిక్కని వ్యాధి వార్తలపై సుక్మా ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కపిల్ దేవ్ కశ్యప్ మీడియాతో మాట్లాడారు. కొద్దిరోజుల క్రితం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. వాళ్లలో ముగ్గురు వృద్ధాప్య సమస్యల వల్ల చనిపోయినట్లు పేర్కొన్నారు. 

Also Read: తమిళనాడులో దారుణం.. కుటుంబాన్ని బలి చేసుకున్న రమ్మీ

అలాగే మిగతా ఇద్దరి మృతికి గల కారణాలు పరిశీలిస్తున్నామని వివరించారు. ఇప్పటిదాకా గుర్తించిన దాని ప్రకారం చూసుకుంటే.. వాతావరణంలో మార్పులు, మహువా పంట సేకరణ కారణాలు కావొచ్చని కూడా తెలిపారు. అయితే ఈ పంట సేకరణ చేసేటప్పుడు గ్రామస్థులు ఒక రోజంతా అటవీ ప్రాంతాలోనే ఉంటారన్నారు. దీనివల్ల వాళ్లు డీహైడ్రేషన్‌కు గురై, అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు.  

Also Read:  పోసానికి ఏపీ హైకోర్టులో నిరాశ..క్వాష్ పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు.

Also Read: సొంత పౌరులపైనే బాంబు దాడి.. వాయుసేన శిక్షణ కార్యక్రమంలో ఘోరం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment