/rtv/media/media_files/2026/04/06/my-husband-is-40-i-am-19-woman-wins-right-to-live-with-lover-in-madhya-pradesh-high-court-2026-04-06-20-33-45.jpg)
My Husband Is 40 I Am 19 Woman Wins Right To Live With Lover In Madhya Pradesh High Court
మధ్యప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన భర్తతో ఉండటం ఇష్టం లేదని ప్రియుడితోనే ఉంటానని కోర్టులో తెలిపింది. చివరికి న్యాయస్థానం ఆ యువతి నిర్ణయాన్నే సమర్థించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల యువతికి 40 ఏళ్ల అవ్దేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లై ఏడాది తర్వాత ఆ యువతి తన ప్రియుడు అనూజ్ కుమార్ అనే వ్యక్తితో పారిపోయింది. దీంతో ఆమె భర్త అవ్దేష్ తన భార్య ఆచూకి చెప్పాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు.
Also read: కాంగ్రెస్, స్టాలిన్‌తో బీజేపీ ఒప్పందం.. మమతా బెనర్జీ సంచలన కామెంట్స్
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చివరికి ఈ వ్యవహారం మధ్యప్రదేశ్ హైకోర్టుకు చేరింది. ఆ యువతి తన భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేదని.. ప్రియుడితోనే ఉంటానని తేల్చిచెప్పింది. ఆ తర్వాత దంపతులిద్దరికీ కొన్నిరోజులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరితో చర్చలు జరిపారు. అయినప్పటికీ యువతి భర్తతో ఉండేందుకు ఒప్పుకోలేదు. తన భర్తకు, తనకు మధ్య 21 ఏళ్ల వయసు తేడా ఉందని.. ఇద్దరి ఆలోచనలు వేరని చెప్పింది. అంతేకాదు అతడు తనను సరిగ్గా చూసుకోవడం లేదని చెప్పింది.
Also read: లాక్‌డౌన్ టైంలో లాక్‌అప్ డెత్.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించిన కోర్టు
తాను ఇప్పుడు చిన్నపిల్లని కాదని.. సొంతంగా జీవించగలనని కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు అంత ఎక్కువగా వయసు వ్యత్యాసం ఉన్నప్పుడు ఇరువురి మధ్య బంధం సమానంగా ఉండదని తెలిపింది. ఆ యువతి వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఎవరినీ కూడా ఎవరితో ఉండాలని బలవంతంగా చెప్పలేమని తెలిపింది. తనకు నచ్చిన వ్యక్తితో ఉండే హక్కు ఆ యువతికి ఉందని స్పష్టం చేసింది. చివరికి ఆమె తన ప్రియుడితో ఉండేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు ఆరు నెలల పాటు ఆ యువతి క్షేమం, భద్రత విషయాలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని కోర్టు పేర్కొంది.
Follow Us