సైఫ్ అలీఖాన్ సెక్యూరిటీని చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు.. విచారణలో విస్తుపోయే విషయాలు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో మరో నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో భాగంగా సైఫ్‌ ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడున్న సెక్యూరిటీని చూసి ఆశ్చర్యపోయారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Saif Ali Khan

Saif Ali Khan

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన సతీమణి, హిరోయిన్ కరీనా కపూర్‌ స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేశారు. దీనిపై మాట్లాడిన కరీనా.. దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఎంతో ఆవేశంగా ఉన్నాడని చెప్పారు. అతడిని సైఫ్ అడ్డుకోగా.. అతడు కోపంతో పలుమార్లు కత్తితో పొడిచాడని తెలిపారు. తన నగలు బయట ఉన్నప్పటికీ కూడా వాటిని తీసుకునేందుకు ప్రయత్నించలేదని.. ఈ దాడి జరిగిన తర్వాత సోదరి కరిష్మా ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. 

ఇప్పటికే పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకోని అతడికి సంబంధం లేదని వదిలిపెట్టారు. తాజాగా మరో నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ వద్ద రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఆకాశ్‌గా గుర్తించారు. ఆ తర్వాత వెంటనే ముంబై పోలీసులతో వీడియో కాల్ ద్వారా సంప్రదించి నిందితుడి గుర్తింపును ధ్రువీకరించారు. ప్రస్తుతం నిందితుడు రైల్వే పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని తీసుకొచ్చేందుకు ముంబయి పోలీసులు ఛత్తీస్‌గఢ‌కు వెళ్తు్న్నట్లు తెలుస్తోంది. 

Also Read: చేతబడి అనుమానం.. వృద్ధురాలికి మూత్రం తాగించి, చెప్పులతో ఊరేగించిన స్థానికులు

ఇదిలాఉండగా.. గురువారం తెల్లవారుజామున దండుగడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరీకి యత్నించాడు. సైఫ్‌ చిన్నకొడుకు జెహ్‌ గది వద్ద ఉన్న అతడిని చూసిన పనిమనిషి కేకలు వేసింది. సైఫ్‌ పరిగెత్తుకుంటూ వచ్చి దుండగుడిని అడ్డుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే దుండగులు సైఫ్‌ను కత్తితో పొడిచి మెట్లగుండా పారిపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్‌ కూడా సీసీటీవీ ఫుటెజ్‌లో రికార్డయ్యాయి. సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడి శరీరంలో దిగిన 2.5 అంగుళాల కత్తి మొనను కూడా ఆపరేషన్ చేసి తొలగించారు. ప్రస్తుతం సైఫ్‌ పరిస్థితి నిలకడగానే ఉంది.  

సరైన సెక్యూరిటీ లేని సైఫ్ ఇల్లు

సైఫ్‌ అలీఖాన్‌పై దాడి జరిగిన తర్వాత ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన అపార్ట్‌మెంట్‌కు చేరుకొని విచారణ ప్రారంభించారు. కానీ అక్కడున్న సెక్యూరిటీని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. సైఫ్ ఇంటి లోపల లేదా బయట ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేదు. అపార్ట్‌మెంట్ మెయిన్ గేట్‌ వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వెనకు గేటు వద్ద ఒక్క సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. గేటు ప్రవేశం వద్ద విజిటర్ రిజిస్టర్ కూడా లేదు. అపార్ట్‌మెంట్ వెనుక భాగంలో ఓ గోడ ఉంది. కానీ ఈ గోడ అంత ఎత్తుగా కూడా లేదు. అలాగే గోడపై వైర్లు ఉన్నాయి. కానీ అవి కూడా వంగి ఉన్నాయి.

 దాడి చేసిన దుండగుడు ఈ గోడ సాయంతోనే భవనంలోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ద్వారా సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ భవనంలో ఉండే ఎవరికైనా ఆ దుండగుడు గురించి తెలిసే ఉండొచ్చని.. అలాగే ఆ దుండగుడు ఆ అపార్ట్‌మెంట్‌లో ఎప్పుడో ఓసారి పనిచేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తంగా ముంబయి పోలీసులు 35 బృందాలుగా ఏర్పడి దుండగుడి కోసం గాలించాయి.  విచారణలో భాగంగా 30 మంది స్టేట్‌మెంట్స్‌ను పోలీసులు రికార్డు చేశారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకోని విచారించారు. కానీ అతడికి ఈ దాడితో సంబంధం లేదని నిర్ధారించి వదిలేశారు. అయితే తాజాగా మరో నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేశారు. ఇతడే అసలైన నిందితుడు అని భావిస్తున్నారు. ప్రస్తుతం అతడు రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. 

Also Read: డిప్యూటీ సీఎం పవన్‌కు ప్రాణహాని.. జనసేన ఆఫీస్​పై ఎగిరిన డ్రోన్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు