/rtv/media/media_files/2025/02/20/NMohWZhKYi4s59zTot3n.jpg)
Eknath Shinde
Eknath Shinde: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపింది. షిండే వాహనాన్ని బాంబుతో పేల్చేస్తామని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబై పోలీసుల(Mumbai Police)కు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం మధ్యాహ్నం గోరెగావ్ పోలీసులకు ఓ మెయిల్ వచ్చింది. అందులో డిప్యూటీ సీఎం షిండే కారును బాంబుతో పేల్చేస్తామని బెదిరించారు.
Also Read: కోడిపుంజుపై కేసు.. ఆర్డీవో విచారణ: చివరికి ఏమైందంటే!
రాష్ట్ర సచివాలయం, జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌కు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చివరికీ ప్రాథమిక విచారలో ఈ బెదిరింపు అంతా ఓ బూటకమని తేలింది. ఈ మెయిల్స్ పంపి బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..కాలేజీకి అంటుకున్న మంటలు
మెయిళ్లు పంపిస్తూ బెదిరింపులు..
ఈ మధ్యకాలంలో చాలామంది కొందరు కేటుగాళ్లు ఇలా మెయిళ్లు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, కంపెనీలు లేదా హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. చివరికీ దీనిపై పోలీసులు విచారణ చేస్తే అదంతా బూటకమని తేలుతోంది. ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్