Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది!

తాను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చానని, అందుకే ఓడిపోయినట్లు భావిస్తున్నానని కమల్‌ హాసన్‌ అన్నారు.20 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఇప్పుడు తన ప్రసంగం, స్థానం వేరేలా ఉండేవన్నారు.

New Update
Tamilnadu: రెండు రోజుల్లో శుభవార్త చెబుతా..కమల్ హసన్

Kamal Haasan

తమ భాష కోసం ఎంతో మంది తమిళులు ప్రాణ త్యాగాలు చేసినట్లు ప్రముఖ నటుడు మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్ హాసన్‌ అన్నారు. భాషతో ఆటలాడుకోవద్దని హెచ్చరించారు. ఎంఎన్‌ఎం 8 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చెన్నైలోని పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ లో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి కమల్ హాసన్‌ మాట్లాడారు.తమిళ భాష ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

Also Read: Eknath Shinde: అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టా.. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు: ఏక్‌నాథ్‌ షిండే

కమల్‌ మాట్లాడుతూ..భాష విషయంలో తమిళులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారన్నారు. భాషను రక్షించుకోవడంలో వారి పోరాటాన్ని ఉద్ఘాటించారు.హిందీ అమలుకు వ్యతిరేకంగా తమిళనాడు చేసిన చారిత్రక పోరాటాన్ని ప్రస్తావించారు.భాషా సమస్యలను తేలికగా తీసుకునేవారిని ఆయన హెచ్చరించారు. భాష కోసం తమిళులు ప్రాణాలు కోల్పోయారు. భాషతో ఆటలాడొద్దు. తమిళులతో పాటు వారి చిన్నారులకు సైతం తమ మాతృభాష ఎంత అవసరమో తెలుసు.వారికి ఏ భాష ఎంచుకోవాలో స్పష్టత ఉంది అని కమల్‌ పేర్కొన్నారు.

Also Read: Illeagal Immigrants: అమెరికా డిపోర్టేషన్‌.. మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదన్న కేంద్రం

ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే...

ఇక తన పొలిటికల్‌ కెరీర్‌ పై కమల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చానని, అందుకే ఓడిపోయినట్లు భావిస్తున్నానని తెలిపారు.20 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఇప్పుడు తన ప్రసంగం స్థానం వేరేలా ఉండేవన్నారు.ఈ రోజు మన పార్టీ పెట్టి 8 సంవత్సరాలు .చిన్న పాపలా ఇప్పుడే ఎదుగుతోంది.

ఈ ఏడాది  పార్లమెంట్‌ లో మన పార్టీ గొంతు వినిపించబోతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీలోనూ అది కచ్చితంగా తెలుస్తుందని కమల్‌ పేర్కొన్నారు.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నధ్దంగా ఉండాలని కార్యకర్తలకు కమల్‌ సూచించారు. ఇక కమల్‌ పార్లమెంట్‌ లో అడుగు పెట్టనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 

డీఎంకే పార్టీ ఆయన్ను రాజ్యసభకు నామినేట్‌ చేయనుందంటూ ఇటీవల మీడియాలో  కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కమల్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.కమల్ వ్యాఖ్యలు ఇటీవలి ప్రచారానికి బలం చేకూర్చినట్లు అవుతోంది.

Also Read: Flipkart Mobile Offers: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది: ఫ్లిప్‌‌కార్ట్‌లో రూ.50వేల ఫోన్ పై భారీ డిస్కౌంట్!

Also Read: iPhone 16e: ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే ఛాన్స్.. 16 సిరీస్‌లో 16e మోడల్.. ధర ఇంత తక్కువా..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment