/rtv/media/media_files/2025/04/06/ON7dGRA3mMbqG5jgKIJF.jpg)
Ram Mandir Surya Tilak Ceremony
Ram Navami 2025: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయం లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరామ నవమి సందర్భంగా, అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లాకు సూర్య తిలకం జరిగింది. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లా నుదుటిపై 'సూర్య తిలకం' ప్రకాశించింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణం రామ్ లల్లా విగ్రహం నుదుటిపై పడి దివ్యమైన తిలకంగా ఏర్పడింది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన రెండో శ్రీరామ నవమి ఇది. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’ చూసి భక్తులు పరవశించారు.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
అయోధ్య ఆలయంలో గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేందుకు మూడో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకం వలే కన్పిస్తోంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐఐఏ) శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు దీనిని నిర్మించారు.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
ప్రతి శ్రీరామ నవమి రోజున..
ప్రతి శ్రీరామ నవమి రోజున బాలరాముడి నుదుటిపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. అందుకోసం గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ శ్రీరామ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని అత్యంత కచ్చితత్వంతో గణించారు.
ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ
అంతకుముందు అయోధ్య, సంభాల్‌లోని ఉత్తరప్రదేశ్ అంతటా ఉన్న దేవాలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భారీగా వస్తున్న యాత్రికుల రద్దీని నియంత్రించేందుకు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. అయోధ్య సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రాజ్‌కరణ్ నయ్యర్ ANIతో మాట్లాడుతూ, "రామ్ నవమి సందర్భంగా చాలా మంది భక్తులు వస్తున్నారు. మేము ప్రాంతాలను వేర్వేరు జోన్లుగా విభజించాము. రద్దీని నియంత్రించడానికి, భద్రతా ప్రయోజనాల కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాము" అని అన్నారు.
ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
శ్రీ రామ్ జన్మభూమి ఆలయంలో ఏర్పాట్ల గురించి అదనపు ఎస్పీ మధుబన్ సింగ్ మాట్లాడుతూ...రామ్ నవమి సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేయడానికి వస్తారు... భక్తుల భద్రత కోసం పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు... సరైన పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు" అని ఆయన చెప్పారు.సంభల్‌లో కూడా దేవాలయాలు, సమీప ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించారు. అధికారులు నిఘా వ్యవస్థల ద్వారా పరిస్థితిని నిశితంగా పరిశీలించారు.ఇక ప్రధాని నరేంద్ర మోదీ 'రామ్ నవమి' శుభాకాంక్షలు తెలుపుతూ దేశ ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహం రావాలని ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ Xలో.. "రామ్ నవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీరాముని జన్మదినోత్సవం సందర్భంగా ఈ పవిత్రమైన రోజు మీ జీవితాల్లో కొత్త చైతన్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. బలమైన, సుసంపన్నమైన, సమర్థవంతమైన భారతదేశ సంకల్పానికి నిరంతరం కొత్త శక్తిని అందిస్తుంది. జై శ్రీరామ్!" అని రాసుకొచ్చారు.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!