New Update
/rtv/media/media_files/2025/03/01/V8p8XGilesqwoafjcN8M.jpg)
Minister Seethakka
మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సుమారు లక్ష మంది మహిళలతో సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సభలో సీఎం రేవంత్ ఇందిరా మహిళా శక్తి పాలసీని విడుదల చేస్తారని తెలిపారు. నారాయణపేట జిల్లా లాగే మిగతా 31 జిల్లాల్లో పూర్తిగా మహిళలే పెట్రోలు బంకులు నిర్వహించేలా చమురు సంస్థలతో ఆరోజున ప్రభుత్వం డీల్ కుదుర్చుకుంటుందని పేర్కొన్నారు.
మహిళా దినోత్సవం నిర్వహణపై శనివారం అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. '' మహిళా సంఘాల కోసం 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారని తెలిపారు. వడ్డీలేని రుణాల చెక్కులను కూడా ఆయన పంపిణీ చేస్తారన్నారు.
అలాగే ఏడాదికాలంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన 400 మంది మహిళలకు రూ.40 కోట్ల బీమా చెక్కులు ఇవ్వనున్నట్లు సీతక్క తెలిపారు. పట్టణాలల్లో ఉండే మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు సీఎం కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందన్నారు. సెర్ప్, మెప్మాలు ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
తాజా కథనాలు