/rtv/media/media_files/2025/02/07/PlADXgQ0sYeLlypmy82C.jpg)
manipur
జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గత కొంతకాలంగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సద్దుమణుగుతున్నాయి అనుకుంటున్న తరుణంలో తెరమీదకి మరోసారి ఏకే 47 తుపాకులు దర్శనమిచ్చాయి.
తాజాగా అక్కడి క్రీడాకారులు ఏకై 47 రైఫిల్స్,అమెరికన్ ఎం సిరీస్ కు చెందిన తుపాకులతో ఫుట్‌బాల్ ఆడారు.మణిపూర్ కు చెందిన ఓ ఇన్ ఫ్లూయెన్సర్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో ఈ విషయం కాస్తా వైరల్ గా మారింది.
అధునాతన ఆయుధాలు...
ఈ వైరల్ వీడియో పై మైతేయి వర్గానికి చెందిన పౌర సమాజ సంస్థ హెరిటేజ్ సొసైటీ స్పందించింది. ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేసింది. ''మణిపూర్ లో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ వైరల్ గా మారింది.క్రీడాకారులు బహిరంగంగా అధునాతన ఆయుధాలు ప్రదర్శించడం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది.
This video of a football tournament in Manipur has gone viral on social media. What is deeply disturbing is the open display of sophisticated weapons by the so called footballers. Or is it a football tournament of Kuki Militants?
— Meitei Heritage Society (@meiteiheritage) February 6, 2025
We urge the authorities to investigate this… pic.twitter.com/3IC5uY9BkH
ఇది కుకీ మిలిటెంట్ల ఫుట్ బాల్ టోర్నమెంటా? దీని పై అధికారులు వెంటనే విచారణ జరపాలి'' అని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ పోస్టు చేసింది.
రాజధాని ఇంఫాల్ కు 30 కిలోమీటర్ల దూరంలో కాంగ్‌పోక్పీ జిల్లాలోని గామ్నోఫైలో ఈ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహించినట్లు వీడియోలో ఉంది. గత నెల 20న ఈ మ్యాచ్ జరిగినట్లు సమాచారం. ఫుట్‌బాల్ టోర్నీ నేపథ్యంలో ముదురు ఆకుపచ్చ దుస్తులు ధరించిన పలువురు స్టేడియం వద్ద తుపాకులతో మోహరించిన దృశ్యాలు వీడియోలో కనపడుతున్నాయి.
Also Read: AP News: సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం.. క్యాబినెట్‌లో కీలక నిర్ణయం!