/rtv/media/media_files/2025/02/03/psFcKw6xv7x5m32dZwAA.jpg)
maoist in karnataka Photograph: (maoist in karnataka)
చత్తీష్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోస్టులు బహిరంగ లేఖ విడుదల చేశారు. మహారాష్ట్ర నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్‌పై గురువారం మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. బీజాపూర్‌లో చంపబడిన 31 మందిలో 21 మంది మావోయిస్టులు తమ సహచరులని లేఖలో పేర్కొన్నారు.
విచక్షణారహితంగా కాల్పులు జరిపి 24 మంది గ్రామస్తులను పోలీసులు గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు నిరసనగా, నక్సలైట్లు ఫిబ్రవరి 18న బీజాపూర్, సుక్మా మరియు దంతెవాడ జిల్లాల్లో బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బహిరంగ లేఖలో తెలిపారు. మావోయిస్టుల సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి సమతా పేరుమీద మావోయిస్టు పార్టీ ఈ లేఖ విడుదల చేసింది.