/rtv/media/media_files/2026/02/27/maoists-2026-02-27-09-14-31.jpg)
Maoists
గతకొంతకాలంగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమైన ఓ మావోయిస్టు కమాండర్‌ను అతడి నాయకుడు హత్య చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాకు చెందిన అన్వేష్ అలియాస్ రేణు మావోయిస్టు డివిజినల్ కమిటీ సభ్యుడిగా, కలహండి-కంధమాల్-బౌధ్-నయాగఢ్ (కేకేబీఎన్) డివిజన్ ప్లటూన్ కమాండర్‌గా పనిచేసేవాడు. ఇతడిపై రూ.22 లక్షల రివార్డు కూడా ఉంది. కొన్ని నెలల క్రితం అన్వేష్ తన క్యాడర్‌తో కలిసి ఒడిశా పోలీసుల ముందు లొంగిపోయేందుకు యత్నించాడు.
Also Read: NCERT బుక్‌లో న్యాయ వ్యవస్థపై వివాదం.. కేంద్రం కీలక ప్రకటన
అన్వేష్ ప్రయత్నాలు అతడి నాయకుడు, రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు సుక్రు, అనుచరులు సిలా, జగేష్‌లకు నచ్చలేదు. దీంతో జనవరి 29న అన్వేష్‌ను వాళ్లందరూ కలిసి హత్య చేశారు. పకారీ రక్షిత అటవీ ప్రాంతంలో అతడిని ఖననం చేశారు. అయితే బుధవారం అన్వేష్ మృతదేహాన్ని బయటకు తీశామని పోలీసులు తెలిపారు.
Follow Us