/rtv/media/media_files/2026/03/29/man-tries-to-open-emergency-door-on-indigo-flight-2026-03-29-21-34-49.jpg)
Man Tries To Open Emergency Door On IndiGo Flight
ఇండిగో విమానంలో షాకింగ్ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎమర్జె్న్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అలెర్ట్ అయిన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. విమానం ల్యాండ్ అయ్యాక అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 6E185 ఇండిగో విమానం శనివారం బెంగళూరు నుంచి వారణాసికి బయలుదేరింది.
Also Read: DMK మేనిఫెస్టో విడుదల.. మహిళలకు నెలకు రూ.2 వేలు, పెన్షన్ పెంపు, ఉచిత విద్యుత్..
విమానం టేకాఫ్ అయిన 15 నిమిషాల్లో యూపీకి చెందిన మహమ్మద్ అద్నాన్ అనే ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ వద్దకు వచ్చాడు. ఫ్లైట్ గాల్లో ఉండగా ఆ డోర్‌ను తెరిచేందుకు యత్నించాడు. వెంటనే అలెర్ట్ అయిన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విమానం ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందు కూడా ఆ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించి గందరగోళం సృష్టించాడు. ఫ్లైట్ 500 అడుగుల ఎత్తులో ఉండగా మరోసారి ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. దీంతో సిబ్బంది పైలట్‌కు సమాచారం అందించగా.. వాళ్లు విమానాన్ని కాసేపు గాల్లోనే తిప్పారు.
Also Read: అమెరికాను తీవ్రంగా దెబ్బకొట్టిన ఇరాన్.. శత్రువుల రాకను పసిగట్టే అవాక్స్ విమానం ధ్వంసం
చివరికి విమానాన్ని వారణాసిలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆ సమయంలో తాను ఎందుకు అలా చేశానో అర్థం కాలేదని.. తనకు దెయ్యం ఆవహించిందంటూ నిందితుడు చెప్పడంతో అందరూ అవాక్కైపోయారు.
Follow Us