Assembly Election Results 2026 : దూసుకుపోతున్న మమత, స్టాలిన్..రెండు స్థానాల్లోనూ విజయ్ ముందంజ

ఉదయం 9:00 గంటల సమాచారం ప్రకారం, ఐదు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో సినీ నటుడు విజయ్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, సీఎం స్థాలిన్‌ కూడా ముందంజలో ఉన్నారు. మరోవైపు  బెంగాల్‌లో మమత పుంజుకోవడం ఉత్కంఠను పెంచింది.

New Update
FotoJet - 2026-05-04T092215.176

Mamata, Stalin

ఉదయం 9:00 గంటల సమయానికి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, దక్షిణాది, తూర్పు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో సినీ నటుడు విజయ్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, సీఎం స్థాలిన్‌ కూడా ముందంజలో ఉన్నారు. మరోవైపు  బెంగాల్‌లో మమత పుంజుకోవడం ఉత్కంఠను మరింత పెంచింది.

తమిళనాడు: 'దళపతి' విజయ్ ఖాతాలో ఆధిక్యం!

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడైన విజయ్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగి తన ప్రభావాన్ని చూపుతున్నారు. విజయ్ తాను పోటీ చేసిన పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇది రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కొళత్తూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆధిక్యంలో ఉండగా, చేపాక్కం-తిరువల్లికేణి నుంచి ఉదయనిధి స్టాలిన్ ముందంజలో ఉన్నారు. అటు ఎడప్పాడి నియోజకవర్గంలో మాజీ సీఎం పళనిస్వామి తన పట్టును నిలుపుకుంటున్నారు.

పశ్చిమ బెంగాల్: మమత మళ్ళీ ట్రాక్‌లోకి!

బెంగాల్‌ రాజకీయం క్షణక్షణానికి రంగు మారుతోంది. భవానీపూర్‌లో వెనుకబడి ఉన్నట్లు వచ్చిన తొలి వార్తల తర్వాత, తాజా లెక్కింపులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చారు. ఉదయం 8:50 గంటల ప్రాంతంలో వెలువడిన ట్రెండ్స్ ప్రకారం మమత తన ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతూనే ఉంది.

పుదుచ్చేరి (యానాం): మల్లాడి వర్సెస్ అశోక్

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాం అసెంబ్లీ స్థానంపై తెలుగు ప్రజలందరి ఆసక్తి నెలకొంది.  సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ కళాశాలలో లెక్కింపు ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతోంది. మొత్తం 35,445 ఓట్లు పోల్ అవ్వగా, తొలుత 315 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు.

ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి తరపున సీనియర్ నేత మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ అభ్యర్థిగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 13 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు