Watch Video: ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఉదంతం బయట పడింది. రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ మంత్రి, ఎన్‌సీపీ (NCP) కీలక నేత నరహరి జిర్వాల్‌కు సంబంధించి ఓ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Maharashtra minister's viral video with transperson sparks row

Maharashtra minister's viral video with transperson sparks row

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఉదంతం బయట పడింది. రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ మంత్రి, ఎన్‌సీపీ (NCP) కీలక నేత నరహరి జిర్వాల్‌కు సంబంధించి ఓ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తితో ఆయన సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాలు దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వ అధికారిక నివాసంలోనే ఆ వ్యవహారం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీడియోలో మద్యం సీసాలు కూడా కనిపించడం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి కూడా ప్రభుత్వ భవనాన్ని ఇలాంటి అసాంఘిక పనులకు ఎలా ఉపయోగిస్తారని విపక్ష నేతలు తీవ్రంగా విమర్శించారు. 

Also Read: ఇంటి వద్దకే రాములవారి తలంబ్రాలు.. ఇలా బుక్ చేసుకోండి?

అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి  పవన్ యాదవ్ అని తెలుస్తోంది. రాష్ట్రంలో మొదటి  ట్రాన్స్‌జెండర్ లాయర్‌గా అతను గుర్తింపు పొందినట్లు సమాచారం. ఈ వీడియో బయట పడటం వెనుక హనీట్రాప్, బ్లాక్‌మెయిల్ కోణం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ యాదవ్ సోదరుడు రవి యాదవ్ దీనికి సంబంధించి కీలక ఆరోపణలు చేశాడు. పవన్ గతంలో కూడా పలువురు ప్రముఖులను బెదిరించి వసూళ్లకు పాల్పడేవాడని చెప్పాడు. ఇప్పటికే ముంబైలో ఇతనిపై పలు కేసులు నమోదైనట్లు తెలిపాడు. ఇది కేవలం నరహరి జిర్వాల్‌ను మాత్రమే కాక మరికొందరు కీలక మంత్రులను టార్గెట్ చేసుకుని చేసిన కుట్రకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు. 

Also Read: అన్ని రాష్ట్రాల సీఎంలతో కలిసి ప్రధాని మోదీ మీటింగ్ .. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా ?

ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంత్రిపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఇది హనీట్రాప్ ముఠా పనే అయినట్లయితే.. ఇంకా ఎంతమంది ప్రముఖులు ఈ వ్యవహారంలో ఇరుక్కున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు