/rtv/media/media_files/2025/02/20/ATmPWEElP6jK4pmZO0oe.jpg)
Maharashtra minister Manikrao Kokate gets two years jail in cheating-forgery case
మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ నేత, వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావు కొకరేకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 30 ఏళ్ల క్రితం మోసానికి పాల్పడిన కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది. మంత్రితో పాటు ఆయన సోదరుడికీ కూడా జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ నాసిక్ కోర్టు తీర్పునిచ్చింది. అక్రమాలు చేసి, ఫేక్ పత్రాలు సృష్టించి ప్రభుత్వ కోటాలో ఫ్లాట్‌లు పొందారని మాజీ మంత్రి దివంగత టీఎస్ డిఘాలో అప్పట్లోనే వీళ్లిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: రేఖా గుప్తాకు ఇతర సీఎంలకు ఉన్న ఆ 5 పవర్స్ ఉండవు.. అవేంటో తెలుసా?
దీంతో వాళ్లపై కేసు కూడా నమోదైంది. 1995 నాటి ఈ కేసుపై విచారణ జరుగుతూనే వస్తుంది. సాక్షులను నాసిక్ జిల్లా సెషన్స్ కోర్టు కోకఠే సోదరులను గురువారం దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదిలాఉండగా. కోర్టు విచారణకు హాజరైన మంత్రి మాణిక్ రావు దీనిపై మాట్లాడారు.
Also Read: కర్మ వెంటాడడం అంటే ఇదేనేమో.. వైరల్ అవుతున్న యాక్సిడెంట్ వీడియో!
కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్తానని స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను విచారణ చేసినట్లు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. తమకు సొంతంగా ఫ్లాట్లు లేవని.. ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని చెబుతూ ఫేక్ పత్రాలు సృష్టించి ప్రభుత్వ కోటాలో ఫ్లాట్లు పొందినట్లు పేర్కొన్నారు.
Also Read: మ్యాట్రిమోనిలో వల.. పెళ్లి పేరుతో 15 మందిని రేప్ చేసిన యువకుడు.. చివరికి ఏమైందంటే!
Also Read: ఏక్‌నాథ్ షిండేను చంపేస్తాం, బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు