/rtv/media/media_files/2026/04/15/maharashtra-man-sexually-exploits-180-minors-2026-04-15-09-56-01.jpg)
Maharashtra Man Sexually Exploits 180 Minors
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఏకంగా 180 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. 350కి పైగా వాళ్ల అశ్లీల వీడియోలు షూట్ చేశాడు. బీజేపీ ఎంపీ ఫిర్యాదులో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పరాత్వడ నగరానికి చెందిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే యువకుడు బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసేవాడు. ఆ తర్వాత వాళ్లకి మాయమాటలు చెప్పి ముంబయి, పూణే నగరాలకు తీసుకెళ్లేవాడు. అక్కడ వాళ్లను లైంగిక వేధించి అశ్లీల వీడియోలు షూట్ చేసేవాడు.
Also Read: దక్షిణాది ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకంటే?
ఆ తర్వాత ఆ వీడియోలతో బాలికలను బ్లాక్‌మెయిల్ చేసేవాడు. కొన్ని వీడియోలను ఆన్‌లైన్‌లో కూడా షేర్ చేశాడు. అయితే ఈ విషయం రాజ్యసభ ఎంపీ అనిల్ బోండేకు తెలిసింది. దీంతో ఆయన పోలీసులకు నిందితుడిపై ఫిర్యాదు చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలన్నారు. లేకపోతే ఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగుతామంటూ హెచ్చరించారు.
Also Read: పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి
చివరికి పోలీసులు నిందితుడు మహమ్మద్ అయాజ్‌ను అరెస్టు చేశారు. కోర్టులో హజరుపర్చారు. దీంతో న్యాయస్థానం అతడిని ఏడు రోజుల కస్టడీకి అప్పగించింది. నిందితుడి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వందలాది అసభ్యకరమైన వీడియోలు ఉన్నట్లు తేలింది. ఈ వీడియోలను అతడు ఇంకెవరికైనా పంపించాడా అనే కోణంలో పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు. సైబర్ సెల్ సాయంతో ఆన్‌లైన్‌లో షేర్ అయిన వీడియోలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Follow Us