వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ? మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలోకి వెళ్లేందుకు శ్రీకాంత్‌కు పర్మిషన్ ఇవ్వడంతో ఈ వివాదం చెలరేగింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలోకి వెళ్లేందుకు శ్రీకాంత్‌కు పర్మిషన్ ఇవ్వడంతో ఈ వివాదం చెలరేగింది. వాస్తవానికి ఏడాది కాలం నుంచి ఆలయ గర్భగుడి ప్రవేశంపై నిషేధం ఉంది. సీఎం కుమారుడికి గర్భగుడిలోకి వెళ్లేందుకు ఎలా అనుమతి ఇస్తారంటూ విపక్షాలు మండిపడ్డాయి. దీంతో ఈ ఘటనపై విచారణకు అధికారలు ఆదేశాలు జారీ చేశారు. Also Read: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే! ఇక వివరాల్లోకి వెళ్తే.. కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న శ్రీకాంత్ షిండే గురువారం సాయంత్రం తన భార్య, మరో ఇద్దరితో కలిసి మహాకాళేశ్వర్ ఆలయానికి వెళ్లారు. అక్కడ వారు గర్భగుడిలో పూజలు చేసినట్లు దీనికి సంబంధించి వీడియో ఒకటి బయటికొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరవుతోంది. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం నిషేధం ఉండగా వాళ్లని అనుమతించడాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇది ఆలయ నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట మరోవైపు ఈ ఘటనపై ఆలయ కమిటీ చైర్మన్, ఉజ్జయిని జిల్లా కలెక్టర్ నీరజ్ కుమార్ స్పందించారు. ఆలయ గర్భగుడిలోకి పర్మిషన్ లేదని.. పర్మిషన్ లేకుండా ప్రవేశించడంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. మరోవైపు ఆలయ అడ్మినిస్ట్రేటర్ గణేష్ థాకడ్ మాట్లాడుతూ ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించామని పేర్కొన్నారు. ఆలయ గర్భగుడి, ప్రవేశ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా? Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్ #maharashtra #telugu-news #eknath-shinde #national-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి