/rtv/media/media_files/2025/02/28/XQd3bC4jLTGDvL3jBGKj.jpg)
Maharashtra CM office bomb threat
Maharashtra CM Office Bomb Threat: గుర్తు తెలియని దుండగులు మరోసారి బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈసారి మహారాష్ట్ర సీఎం కార్యాలయానికి (మహారాష్ట్ర CMO) బాంబు బెదిరింపు వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయంపై దాడి చేస్తామని ముంబై పోలీసులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ అందింది. అయితే అది పాకిస్తాన్ నంబర్ నుండి రావడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఆ బెదిరింపు మెసేజ్‌లో.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం బూడిదైపోయేంతలా బాంబులు వేస్తామని చెప్పినట్లు తెలిసింది.
Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!
పాకిస్తాన్ నంబర్
అంతేగాక ఈ సందేశం పంపిన వ్యక్తి తన పేరును కూడా చెప్పినట్లు సమాచారం. అతడి పేరు మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్‌గా పేర్కొన్నట్లు తెలిసింది. ఇక ఎప్పుడైతే బెదిరింపు సందేశం వచ్చిందో ఒక్కసారిగా ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్పాట్ డెడ్!
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయంపై దాడి చేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు పాకిస్తాన్ నంబర్ నుండి వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఈ బెదిరింపు మెసేజ్ వచ్చిన వెంటనే పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!
గతంలో డిప్యూటీ సీఎం
ఇది మొదటిసారి కాదు.. గత వారం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు కూడా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. షిండే వాహనాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ గోరేగావ్, జెజె మార్గ్ పోలీస్ స్టేషన్లు, సిఎంఓ, మంత్రిత్వ శాఖతో సహా అనేక అధికారిక ఖాతాలకు ఇమెయిల్ పంపబడింది.
Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక్కడి సీట్లు ఇక్కడివారికే
ఈ కేసులో గోరేగావ్ పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో నిందితుడు ఈమెయిల్ పంపినట్లు అంగీకరించినట్లు తెలిసింది. అప్పటి నుండి ముంబై పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు ఈ బెదిరింపు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.