ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా యూపీలోని ప్రయాగ్‌రాజ్ లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి రోజైన సోమవారం ప్రారంభమైన మహా కుంభమేళా 45 రోజుల పాటు జరిగి ఫిబ్రవరి 26న పూర్తవుతుంది. తొలి రోజే త్రివేణీ సంగమంలో కోటిన్నర మంది స్నానాలు ఆచరించినట్లు అధికారులు వివరించారు.
దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పూజలు నిర్వహిస్తున్నారు. విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో త్రివేణీ సంగమంలో స్నానాలు చేసి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Horoscope : ఈ రాశివారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు దక్కుతుంది!
ఈ మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కనీ వినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది. భక్తజనసంద్రం కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు తప్పిపోతున్నారు. అలా తప్పి పోయిన వారి కోసం కూడా యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. తొలి రోజైన సోమవారం నాడే కనీసం 250 మంది తమ వారి నుంచి తప్పిపోయినట్లు తెలుస్తుంది. ఇలాంటి వారి కోసం ``భులా-భట్కా`` క్యాంపులను సిద్దం చేశారు.
#WATCH | ANI drone camera captures a bird's eye view of the first 'Amrit Snan' during the ongoing #MahakumbhMela2025 in Prayagraj, UP pic.twitter.com/7AUug82yhl
— ANI (@ANI) January 14, 2025
ఎవరు తప్పిపోయిన ఈ క్యాంప్ దగ్గరకు వెళ్తే.. పేరు, ఊరు, ఫ్యామిలీ మెంబర్ల వివరలను మైక్‌ల ద్వారా చెబుతారు. తప్పిపోయిన వారిని తిరిగి తమ కుటుంబాలతో కలుపుతున్నారు. ఒకవేళ ఎవరూ రాకపోతే వారిని ప్రత్యేక షెల్టర్లలో ఉంచుతున్నారు. ఇలా తప్పి పోయిన వారి కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఎత్తైన వాచ్ టవర్లను సిద్దం చేశారు. మహిళలు, పిల్లల కోసం ``ఖోయా-పాయా`` అంటూ వేర్వేరు క్యాంపులను సిద్దం చేశారు.
Also Read: Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు
ఈ క్యాంపుల వద్దనే వెయిటింగ్ రూమ్స్, మెడికల్ క్యాంప్స్, రిఫ్రెషింగ్ రూమ్స్‌ను కూడా సిద్దం చేశారు. అలాగే ప్రతి సెంటర్ వద్ద 55 అంగుళాల ఎల్‌ఈడీ టీవీలను కూడా సిద్ధం చేశారు. తప్పిపోయిన వారి వివరాలను ఆ టీవీల్లో డిస్‌ప్లే చేస్తున్నారు. అలాగే తప్పిపోయిన వారి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వెంటనే వివరాలు చేరవేసేలా ప్రత్యేక జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్నారు.
#WATCH | Prayagraj | Naga sadhus of Niranjani and Anand Akharas proceed for 'Amrit Snan' at #MahaKumbhMela2025 pic.twitter.com/oXZ5NJiNsl
— ANI (@ANI) January 14, 2025
Also Read: USA: లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు వెనుక షాకింగ్ కారణం..వెలుగులోకి నిజాలు
Also Read: Oscar: మరోసారి వాయిదా పడ్డ ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ!