/rtv/media/media_files/2025/02/18/wQJxgku6SUvH6LPtaBvz.jpg)
maha kumbha mela 2025
యూపీ ప్రయాగ్ రాజ్ (Prayagraj) లో కొనసాగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) మరో తొమ్మిది రోజుల్లో ముగియనుంది. చివరి వారం కావడంతో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 125 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు రోజుకు లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. కుంభమేళాకు వెళ్లే దారులన్నీ వాహనాలతో బారులు తీరాయి. రైల్వే స్టేషన్లు, బస్ స్టాపులు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
చివరి తేదీ పొడగింపు..
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కుంభమేళా ముగింపు తేదీని పొడగించనున్నట్లు తెలుస్తోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాగ్ రాజ్ వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువవడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువ మంది చిన్నపిల్లలే ఉండడం బాధాకరం. దీంతో మళ్ళీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ముగింపు తేదీని పొడగిస్తున్నట్లు సమాచారం.
Also Read : ఇండియాలో రిచెస్ట్ పార్టీగా బీజేపీ.. 75% కమలం ఖాతాలోకే
మరోవైపు భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం స్పెషల్ రైళ్ల (Special Trains) ను కూడా నియమించింది. మచిలీపట్నం, గుంటూరు, కాకినాడ టౌన్, విజయవాడ, మౌలాలీ, చర్లపల్లి, వికారాబాద్, కాచీగూడ, సికింద్రాబాద్ నుంచి ప్రత్యక రైలు సేవలను అందిస్తోంది. జనవరి 13న మొదలైన మహాకుంభమేళా ఉత్సవం ఫిబ్రవరి 26 శివరాత్రి రోజుతో ముగియనుంది. ఇప్పటివరకు 50 మంది మహా కుంభమేళా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 1.36 కోట్ల మంది కుంభమేళా వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: Malayalam Film Industry: మలయాళం ఇండస్ట్రీలో అన్నీ బంద్.. జూన్ 1 నుంచి ఏం జరగబోతుందంటే