ప్రస్తుతం మహా కంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. ఇందులో పవిత్ర స్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని కోట్ల మంది భక్తులు వెళ్తున్నార. ఇక్కడికి చేరుకోవడానికి ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పెషల్ ట్రైన్లు వేసింది. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ప్రత్యేక ప్యాకేజీలతో తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు మహా కుంభమేళాకు వెళ్లి వచ్చేందుకు తక్కువ ఖర్చుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది.
ఇది కూడా చూడండి: budget 2025-26 బడ్జెట్‌లో మిడిల్ క్లాస్‌కు గుడ్‌న్యూస్..!
మొత్తం 8 రోజుల పాటు..
కుంభమేళాకు వెళ్లే ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలులో ఎకానమీ క్లాస్‌లో పెద్దలకు ధర రూ.23,035 ఉండగా.. 11 ఏళ్ల లోపు పిల్లలకు రూ. 22,140గా నిర్ణయించింది. ఫిబ్రవరి 15న ఈ రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. మళ్లీ తిరిగి ఫిబ్రవరి 22న సికింద్రాబాద్ చేరుకుంటుంది. మొత్తం 8 రోజులపాటు జరిగే యాత్రలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లను దర్శించుకుంటారు.
ఇది కూడా చూడండి: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!
ఫిబ్రవరి 15న సికింద్రాబాద్‌లో బయలుదేరి 18న ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది. 19న వారణాసిలో కాశీ విశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలు దర్శించుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత ఫిబ్రవరి 20న అయోధ్య చేరుకుని అక్కడ శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హిని సందర్శించి తిరిగి ఫిబ్రవరి 22న రాత్రి సికింద్రాబాద్ చేరుకుంటారు.
ఇది కూడా చూడండి: Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు
ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అయ్యి.. కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, చత్రపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ స్టేషన్ల మీదుగా చేరుకుంటుంది.
ఇది కూడా చూడండి: Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్