ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 13న ప్రారంభమైన ఈ ఉత్సవం ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ప్రతీరోజు వేలాది మంది ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తు్న్నారు. భక్తులతో నిండిపోయిన ప్రయాగ్ రాజ్.. ప్రస్తుతం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఏకంగా 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ అంచనా వేసింది. పలు రంగాల నుంచి సేకరించిన ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.
Also Read: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు
యూపీలో ఆర్థికాభివృద్ధి, తాత్కాలిక ఉపాధి కల్పన జరుగుతుందని ఆ సంస్థ సీఈవో సచిన్ తెలిపారు. పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే దాదాపు 4.5 లక్షల మందికి ఉపాధి లభించి ఉండొచ్చని చెప్పారు. ఇక హోటల్ స్టాఫ్, టూర్ గైడ్, ట్రావెల్ కన్సల్టెంట్లు, ఈవెంట్ కోఆర్డినేటర్లుగా మరికొందరికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. వైద్య శిబిరాల్లో 1.5 మంది నర్సులు, పారామెడిక్స్, ఇతర వైద్య సిబ్బందికి తాత్కాలిక అవకాశాలుంటాయని పేర్కొన్నారు.
Also Read: ఆ దేశంలో స్థానికులను భయపెడుతున్న అగ్నిపర్వతం.. వెయ్యిసార్లు విస్పోటనం
సైబర్ సెక్యూరిటీ, దర్శన్ యాప్స్ వంటి విభాగల్లో పనిచేసేందుకు దాదాపు 2 లక్షల మంది ఐటీ రంగ నిపుణులకు డిమాండ్ ఉంటుందని చెప్పారు. ఆహార ఉత్పత్తులు అలాగే ప్రసాదాలు కొనేవారి సంఖ్య కూడా పెరగడంతో లక్ష మందికి ఉపాధి లభించినట్లు తెలిపారు. ఇదిలాఉండగా.. కుంభమేళాలో భారీ భద్రతను మోహరించారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అక్కడికి తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
Also Read: టీ కోసం ఇంటికి పిలిచి.. బట్టలిప్పి టెంప్ట్ చేసి: హనీట్రాప్ ముఠా గుట్టురట్టు!