Maha Kumbh: యూపీలో మహా కుంభమేళా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ కు వెళ్లే విమానాల టికె్ ధరలు గణనీయంగా పెరిగాయి. ట్రావెల్‌పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం గతేడాది ఈ సమయంలో మధ్య ప్రదేశ్ లోని భోపాల్ నుంచి ప్రయాగరాజ్ టికెట్ ధర రూ.2977 గా ఉంది. ఆ ధర ఇప్పుడు ఏకంగా 498 శాతం పెరిగింది.
Also Read: BREAKING: దానం నాగేందర్‌కు మంత్రి పదవి.. సీఎం రేవంత్ సంచలన వ్యూహం ఇదే!
అంటే టికెట్ ధర రూ.17,796 గా కొనసాగుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు వన్ వే బుకింగ్ ల సరాసరిన లెక్కగట్టడంతో ఈ మొత్తం తేలింది. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లే విమానాల టికెట్ ధర 21 శాతం పెరిగి రూ.5748 కి చేరింది. ముంబయి-ప్రయాగ్‌రాజ్ టికెట్ ధర 13 శాతం పెరిగి రూ.6381 గా ఉంది.
బెంగళూరు-ప్రయాగరాజ్ మార్గంలో విమాన టికెట్ ధరలు 89 శాతం పెరిగాయి. బెంగళూరు-ప్రయాగ్ రాజ్ సర్వీస్ కు రూ.11,158 వసూలు చేస్తున్నారు. అహ్మదాబాద్- ప్రయాగరాజ్ ఇకెట్ ధర 41 శాతం పెరిగి రూ. 10,364 గా ఉంది.మహా కుంభ మేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ కు సమీప నగరాలైన లక్నో, వారణాసి నగరాల టికెట్ ధరలు 3-21 శాతం పెరిగాయి.
Also Read: Job Callender: నిరుద్యోగులను గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల!
ఏడాది మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకుంటే విమాన సర్వీసుల బుకింగ్స్ లో 162 శాతం పెరుగుదల కనిపిస్తోంది. లక్నో టికెట్లకు 42 శాతం , వారణాసి టికెట్లకు 127 శాతం డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్‌కు 20 గమ్యస్థానాల నుంచి వన్ స్టాప్, డైరెక్ట్ విమానాలు వస్తున్నాయని ఇక్సిగో తెలిపింది.
కేవలం ఢిల్లీ నుంచి మాత్రమే...
గత కుంభమేళా సమయంలో కేవలం ఢిల్లీ నుంచి మాత్రమే సర్వీసులు అందుబాటులో ఉండేవి.వివిధ మెట్రో నగరాల నుంచి ప్రయాగ్ రాజ్ కు రూ.7-10 వేల వరకు విమానయాన సంస్థలు వసూలు చేస్తున్నాయి. నెల రోజుల ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఆ ధరలు వర్తిస్తున్నాయి. భోపాల్-ప్రయాగ్‌రాజ్ మార్గంలో సర్వీసులు తక్కువ,డిమాండ్ అధికంగా ఉండటంతో టికెట్ ధర రూ.17 వేలకు చేరినట్లు తెలుస్తోంది.
పుణ్యస్నానాలు ఆచరించడానికి కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి.ఆ రోజులకు గిరాకీ ఎక్కువగా ఉంది.జనవరి 27న ముంబయి నుంచి బయల్దేరనున్న వన్ వే నాన్ స్టాప్ సర్వీసు ధర రూ. 27 వేలుగా చూపిస్తోంది.విమాన టికెట్ ధరలు పెరిగిన నేపథ్యంలో రైళ్ల టికెట్ బుకింగ్స్ సైతం గణనీయంగా పెరిగాయి. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.
Also Read: Traffic Jam: తిరుగుపయనమవుతున్న నగరవాసులు.. భారీగా ట్రాఫిక్ జాం
Also Read: Fire Accident: తెలంగాణలో ఘోర అగ్ని ప్రమాదం.. 400 పత్తి బస్తాలు దగ్ధం