/rtv/media/media_files/2025/03/30/ftkebbzOcNbT579nuVHC.jpg)
Earthquake in Nepal
ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపాలు పెను విషాదం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో నమోదైంది. గర్ఖాకోట్‌కు 3 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ఇది నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ భూకంప ప్రభావం ఉత్తర భారత్‌ను కూడా తాకింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా అనేదానిపై క్లారిటీ లేదు.
EQ of M: 5.0, On: 04/04/2025 19:52:53 IST, Lat: 28.83 N, Long: 82.06 E, Depth: 20 Km, Location: Nepal.
— National Center for Seismology (@NCS_Earthquake) April 4, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/DxUFnxRvc7
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో 2.6 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇలా జరగిన ఒక రోజు తర్వాత నేపాల్‌లో భూకంపం సంభవించడం ఆందోళన రేపుతోంది. ఇదిలాఉండగా.. ఇటీవల మయన్మార్‌లో సంభవించిన భూకంపం విధ్వంసం సృష్టించింది. దీని ప్రభావానికి మయన్మార్‌తో పాటు, థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ భూ ప్రళయానికి ఇప్పటిదాకా 4 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 5 వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. 341 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు.
Also Read: వక్ఫ్ బిల్లు వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, ఎంఐఎం
పలు భవనాలు కుప్పకూలిపోయాయి. మరికొన్ని భూ ప్రకంపనలకు ఊగిపోయాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వరుసగా ఇలా భూకంపాలు సంభవించడం అందరినీ ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే మయన్మార్, థాయ్‌లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకోగా తాజాగా నేపాల్ భూకంపం రావడం కలకలం రేపుతోంది. మళ్లీ ఎక్కడ భూకంపం సంభవిస్తుందోనన్న భయాలు కూడా నెలకొన్నాయి.
Also Read: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు