/rtv/media/media_files/2026/04/20/madras-high-court-issues-notice-to-tvk-chief-vijay-over-alleged-rs-100-cr-discrepancy-in-affidavit-2026-04-20-18-20-36.jpg)
Madras High Court issues notice to TVK chief Vijay over alleged Rs 100 cr discrepancy in affidavit
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు పంపింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాల్లో రూ.100 కోట్లకు పైగా తేడాలు ఉన్నాయని పేర్కొంటూ చెన్నైకి చెందిన వీవీ విఘ్నేశ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విజయ్ సమర్పించిన పత్రాల్లో స్పష్టత లేదని ఆరోపించాడు. ఈ క్రమంలోనే తాజాగా మద్రాస్ హైకోర్టు విజయ్‌కు నోటీసులు జారీ చేసింది.
Also Read: చెట్టును ఢీకొని కుప్పకూలిన ప్రైవేటు జెట్.. షాకింగ్ వీడియో
తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ముందుగా పెరంబూర్ నియోజకవర్గంలో సమర్పించిన అఫిడవిట్‌లో విజయ్ తన ఆస్తుల విలువ రూ.115 కోట్లుగా చూపించారు. ఆ తర్వాత తిరుచ్చి నియోజకవర్గంలో మాత్రం తన ఆస్తి వివరాలను రూ.220 కోట్లుగా పేర్కొన్నారు. ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో ఆస్తుల వివరాల్లో ఇంత భారీగా తేడా ఉండటం సంచలనం రేపింది.
Also Read: రూ.79,450 కోట్లు బూడిదపాలు.. రేపు ఓపెనింగ్, ఈరోజు కాలిపోయిన రిఫైనరీ ఫ్యాక్టరీ
ఈ క్రమంలోనే వీవీ విఘ్నేశ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విజయ్ సమర్పించిన ఆస్తుల వివరాల్లో రూ.100 కోట్లకు పైగా భారీ వ్యత్యాసం ఉందన్నారు. ఆస్తులకు తేడాకు సంబంధించి ఆయన ఎలాంటి అదనపు పత్రాలు లేదా వివరణలను అఫిడవిట్‌కు జత చేయలేదని పిటిషనర్ ఆరోపించారు. దీన్ని తీవ్రమైన ఎన్నికల ఉల్లంఘనగా పరిగణించాలంటూ వాదించారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం.. ఆస్తుల తేడాకు సంబంధించి వివరణ ఇవ్వాలని విజయ్‌ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Follow Us